తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హడావుడి చేసారు మాజి ఎమ్మెల్యే, హిందూత్వ ఐకాన్ రాజా సింగ్. సాధారణంగా సంచలన వ్యాఖ్యలతో, బోల్డ్ స్టెప్స్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఆయన .. ఈసారి తానే పార్టీలో ఉండే నాయకులపై గట్టిగానే విరుచుకుపడ్డారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలక నేతలపై విమర్శల వర్షం కురిపించిన రాజా, చివరికి తన పదవికే రాజీనామా చేసేసి... బీజేపీలో తీవ్ర అసంతృప్తిని రెచ్చగొట్టారు ..  "రాజా సింగ్ vs బీజేపీ లీడర్స్ష ..  అసలు రాజా సింగ్‌కు గుండె కోత ఎక్కడ మొదలైంది? హిందూత్వ భావజాలానికి పూర్తి బాసటగా నిలిచిన ఆయన.. తాను ఎన్నో రిస్కులు తీసుకున్నా, పార్టీ లోపల తనకు తగిన గుర్తింపు లేదనే నెపంతో విరుచుకుపడ్డారు.
 

ఇదే సమయంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్‌లను పరోక్షంగా టార్గెట్ చేస్తూ.. తాను మాత్రమే నిజమైన యోధుడినని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే పార్టీ శ్రేణుల్లో మాత్రం మిక్స్‌డ్ రియాక్షన్లు వచ్చాయి. "రాజా బోల్డ్.. కానీ పార్టీ డిసిప్లిన్ ముఖ్యం" అనే భావన పెరిగింది. రాజా సింగ్ తనదైన శైలిలో ప్రచారం చేసినా.. అసెంబ్లీలో ఆయన బలహీనతలపై విమర్శలు వెల్లువెత్తాయి. సమర్థవంతంగా మాట్లాడే నేతలుగా రఘునందన్ రావు, ఈటల రాజేందర్ పేరు వినిపించగా.. రాజా సింగ్‌ మాత్రం ఆ స్థాయిలో మెరువలేకపోయారన్నది వాస్తవం. అదే సమయంలో బండి సంజయ్ నేతృత్వంలో ఎనిమిది ఎంపీ సీట్లు గెలవడం, కిషన్ రెడ్డి కాలంలో జీహెచ్‌ఎంసీ ఫలితాల్లో చక్కటి గ్రాఫ్ కనిపించడం పార్టీ అభివృద్ధికి సూచనలుగా నిలిచాయి.



రాజీనామా.. శివసేన మాటలు.. నెక్స్ట్ ఏంటి? ..  కొత్తగా తెరపైకి వచ్చిన రామచంద్రరావుపై రాజా సింగ్ ఘాటుగా స్పందించడంతో హైకమాండ్ ఆయనపై కళ్లం వేసింది. దీంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజా సింగ్‌కు పార్టీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇదే సమయంలో ఆయన శివసేనలో చేరుతారనే గాసిప్స్ తెరపైకి వచ్చాయి. అయితే రాజా వెంటనే వాటిని ఖండిస్తూ, "నేను బీజేపీతోనే ఉంటా, నాయకత్వం ఇచ్చే సూచనల ప్రకారం నడుస్తా" అన్నారు. గేమ్ ఓవర్ అయిందా? లేక రీఎంట్రీ కోసం వెయిటింగా? ..  ఇప్పుడే బయటికి వెళ్లినా.. రాజా సింగ్‌కి మళ్లీ పార్టీలో చోటు దక్కుతుందా? నాయకత్వం అపాయింట్‌మెంట్ ఇస్తుందా? ఇవే పెద్ద ప్రశ్నలు. కానీ ఒకటి మాత్రం ఖాయం.. తెలంగాణ బీజేపీలో రాజా సింగ్ ఎపిసోడ్ మరోసారి రాజకీయ వేడి పెంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: