
ఈ మధ్యకాలంలో పెద్ద వెంచర్లు అన్నటువంటిది సక్సెస్ కావట్లేదని అధికారిక గణంకాలే తెలియజేస్తున్నాయి. హైలీ లగ్జరియాస్ ఫ్లాట్లు తప్పించి మిడిల్ క్లాస్ ఫ్లాట్లు అమ్ముడుపోలేదు.. ఎందుకంటే వాటిని ఎక్కువగా కొనుగోలు చేసేది అక్కడ ఇల్లు లేని వారు మాత్రమే.. ఒకవేళ ఏపీ నుంచి వెళ్లినటువంటివారు ఇక్కడున్నటువంటి ఆస్తిని అమ్మేసి అప్పుచేసి అక్కడ ఇల్లు కొన్నారు, ఫ్లాట్లు కొన్నారు, స్థలాలు కొంటూ ఉన్నారు. హైదరాబాద్ అనేది ఎప్పటికీ కూడా ఎవరి గ్రీన్ అని చెప్పవచ్చు.
కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ అభివృద్ధి చెందుతున్నటువంటి అమరావతి అనే కాన్సెప్ట్ తెర మీదకి రావడంతో పాటుగా సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటికీ.. భూములు మీద పెట్టుబడి పెట్టేవారు కమ్మ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత కాపు సామాజిక వర్గం ఉంటది. అయితే ఆ వర్గాల వారు అక్కడ పెట్టుబడి ఆపినారు.. ఇక్కడ ఇంకా పెట్టుబడి పెట్టలేదు.. ఇంకా అమరావతి పుంజుకోలేదు కానీ రేట్లు మాత్రం ఎక్కువ చెబుతున్నారు. కొనేవాళ్ళు తక్కువ ఉన్నారు. హైదరాబాద్ వంటి ప్రాంతంలో డల్ అయ్యింది. అక్కడేమో పికప్ కాలేదు.. దీంతో హైదరాబాదులో వెంచర్ల పికప్ చేయాలన్నటువంటిది సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం. ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అన్నటువంటిది చాలా దెబ్బ పడింది.. దీనివల్ల రియల్ ఎస్టేట్ అంతా అమరావతి వైపుకి టర్న్ అవుతోందనే విధంగా వినిపిస్తోంది.