
అయితే నీట్ నిబంధనల ప్రకారం ఇంటర్ లో తప్పనిసరిగా ఇంగ్లీష్ ను ఫస్ట్ లేదా సెకెండ్ లాంగ్వేజ్ గా ఎంచుకోవాలి. ఇంటర్ మార్కుల మెమోలో ఫస్ట్ లాంగ్వేజ్ అనే కాలమ్ వద్ద 'E' (ఎగ్జెంప్టెడ్) అని ఉండటంతో మెడికల్ సీటు కోల్పోతామని విద్యార్థితో పాటు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తమ సమస్యను పరిష్కరించాలంటూ మంత్రి నారా లోకేష్ ను ఆశ్రయించారు. దీంతో తక్షణమే స్పందించిన మంత్రి లోకేష్.. గతంలో ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకు ఇంగ్లీష్ సబ్జెక్టులో కనీస మార్కులు 35 కలుపుతూ జారీ చేసిన ప్రత్యేక జీవో ద్వారానే బైపీసీ విద్యార్థికి కూడా మార్కుల మెమోలో కూడా కనీస మార్కులు కలిపి సమస్యను పరిష్కరించారు. తక్షణమే స్పందించి తమకు అండగా నిలవడం పట్ల మంత్రి నారా లోకేష్ కు విద్యార్థి, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు