ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు తాజాగా కూటమి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తెలిపింది. భారీగా ఉద్యోగాల భర్తీకి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. విద్యుత్ పంపిణీ సంస్థలలో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రతి ఏటా కూడా భర్తీ చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం 2,511 పోస్టులను భర్తీ చేయడానికి సీఎం చంద్రబాబు కూడా ఆమోదం తెలిపారట ఇందులో 1,711 జూనియర్ లైన్మెన్ పోస్టులతో పాటు..800 AEE పోస్టులను భర్తీ చేయబోతున్నారు. అయితే చివరిసారిగా ఈ పోస్టులను 2018లో అప్పటి టిడిపి ప్రభుత్వం భర్తీ చేసింది .మళ్ళీ ఇప్పుడు చాలా కాలం తర్వాత ఈ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేస్తోంది.


అయితే ఈ పోస్టులకు బీటెక్, డిప్లమా, ఐటిఐ చేసిన నిరుద్యోగులకు మంచి అవకాశం అని చెప్పవచ్చు. నిజానికి APSPDCL లో 2,850 పోస్టులు ఖాళీగా ఉండగా.. ఏపీసిపిడిసిఎల్ లో 1,708 పోస్టులు ఖాళీగా ఉండగా.. ఏపీఈపీడీసీఎల్ 2,584 పోస్టులు ఖాళీగా ఉండగా మొత్తం మీద 9,849 పోస్టులు ఖాళీగా ఉన్నాయట. అయితే ఇందులో 75% పోస్టులను సైతం భర్తీ చేయబోతున్నట్లు సమాచారం. టెక్నికల్, నాన్ టెక్నికల్ క్యాడర్లో ఈ పోస్టులను భర్తీ చేయబోతున్నారు.


సివిల్, ఎలక్ట్రికల్, ఐటి, టెలికాం విభాగాలలో పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఈ పోస్టులకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలుపడబోతోంది. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థలలో పోస్టులు భర్తీ అన్నది చాలా కష్టమే ఇటీవలే సీఎం చంద్రబాబు సమీక్షంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, సిఎస్ విజయానంద పోస్టులను వెంటనే కాకున్నప్పటికీ ప్రతి ఏటా కూడా ఖచ్చితంగా ఉద్యోగాల భర్తీ నియమించాలని కోరామంటూ తెలియజేశారు. విద్యుత్ శాఖలో ఉద్యోగుల పైన పని ఒత్తిడి తగ్గించేందుకు ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం చంద్రబాబుకు తెలియజేశామంటూ అధికారులు తెలిపారు. అతి త్వరలోనే ఏపీ ప్రభుత్వం భారీగా ఉద్యోగాలు భర్తీపైన ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: