అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా విషయంలో ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారు.  ఒకవైపు టారీఫ్స్ విషయంలో బీజింగ్ కు వార్నింగ్ ఇస్తూనే మరోవైపు చైనా విద్యార్థులకు గేట్లు ఎత్తేస్తాం అంటూ ట్రంప్ కామెంట్లు చేశారు. 6 లక్షల మంది చైనీస్ విద్యార్థులకు ఆహ్వానం పలుకుతూ ట్రంప్ చేసిన కామెంట్లు  సోషల్ మీడియా వేదికగా  సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ట్రంప్ తీరు విషయంలో సొంత పార్టీ నేతలు సైతం అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

వలసదారులు, విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ ఒకింత కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వాళ్ళు, పరిశోధన రంగంలో ఉన్నవాళ్లకు వీసాలు రద్దు చేస్తామని గతంలో హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.  ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ తో పాటు ఇతర దేశాల వీసాల నిబంధనలను సైతం ఒకింత కఠినతరం చేసిన సంగతి తెలిసిందే.

అయితే చైనా విషయంలో ట్రంప్ యూటర్న్ తీసుకోవడం సోషల్ మీడియాలో పలు అనుమానాలకు తావిస్తోంది.  చైనీస్ విద్యార్థులను అమెరికాలోకి అనుమతించబోమంటూ వచ్చిన వార్తలను మేము కూడా విన్నామని  కానీ మేము వారికి యూనివర్సిటీలో ప్రవేశాలను కల్పించాలని అనుకుంటున్నామని ట్రంప్ వెల్లడించారు.  ఇలా చేయడం మాకు కూడా ముఖ్యం అని ట్రంప్  అభిప్రాయం వ్యక్తం చేశారు.

చైనాతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని మేము భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో 2.70 లక్షలకు పైగా  చైనీస్ విద్యార్థులు చదువుకుంటున్నారని తెలుస్తోంది. ట్రంప్ ప్రకటన సొంత పార్టీలోనే విబేధాలకు దారి తీసిందని తెలుస్తోంది.  సొంత పార్టీ నేతలతో పాటు మేక్  అమెరికా గ్రేట్ అగైన్ నేతలు సైతం ట్రంప్ ప్రకటన విషయంలో అసంతృప్తి  వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: