ఏదైనా ఊరు ఉంది అంటే ఆ ఊరు ఒకే మండలంలో భాగం అయి ఉంటే దానికి పెద్దగా కష్టాలు ఉండవు. అక్కడ ఉన్న ప్రజలు అందరూ అదే మండలంలో భాగం అయి ఉన్నట్లు అయితే వారికి అందే సేవలు అన్ని మండల కేంద్రంలో ఈజీగా దక్కుతూ ఉంటాయి. దానితో ప్రజలు కూడా ఎక్కువ కష్టాలను ఎదుర్కోవాల్సి ఉండదు. కానీ ఒక గ్రామం మాత్రం ఏకంగా మూడు మండలాల్లో ఉంది. దానితో ఒకే గ్రామంలో నివసిస్తున్న కూడా కొన్ని సేవలను అందుకోవడానికి అక్కడ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మరి అలా ఒకే గ్రామంలో ఉన్న మూడు మండలాల్లో ఆ గ్రామానికి సంబంధించిన ప్రజల పేర్లు ఉన్నాయి. దానితో ఒకే గ్రామం లోని కొంత మంది ప్రజలు మండల కేంద్రం సర్వీసులను పొందడానికి మూడు మండలాల్లో తిరగవలసి వస్తుంది.

జంపపాలెం అనే గ్రామం మూడు మండలాలు మరియు మూడు గ్రామ పంచాయతీలలో విస్తరించి ఉంది. జంపపాలం గ్రామం ఒకటే ఊరు అయినా కూడా మూడు పంచాయతీలలో విస్తరించి ఉండటంతో ఆ ప్రాంత ప్రజలు పరిపాలనపరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జంపపాలేం గ్రామం ఎలమంచిలి మండలం పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామ ప్రజలు వ్యవసాయ ఆధారంగానే జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ గ్రామంలో దాదాపుగా రెండు వేల జనాభా ఉంది. పేరుకు ఇదే ఒకే గ్రామం అయినా కూడా ఈ గ్రామం లోని నివాసాలు ఏకంగా మూడు గ్రామాల్లో విస్తరించి ఉన్నాయి.

దానితో అక్కడి ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామం.లోని కొంత భాగం కాశీంకోట మండలం ఏనుగుతిని గ్రామపంచాయతీ శివారు ప్రాంతం చిన్న ఏనుగుతుని పేరుతో కొనసాగుతుంది. ఇక మరికొంత భాగం మునిగపాక మండలం మేలిపాక రెవెన్యూ లో కొనసాగుతుంది. ఇక మరి కొంత భాగం మెలిపాక శివారు చిన్న యాదగిరి పాలెం పరిధిలో కొనసాగుతుంది. ఇలా ఈ ఒకే గ్రామం మూడు మండలాల్లో , మూడు గ్రామపంచాయతీలలో కొనసాగుతుంది. దానితో ఇక్కడి ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: