తెలుగు సినీ ప్రేమికులకు బన్నీ వాసు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన అల్లు అర్జున్ స్నేహితుడిగా గీత సంస్థలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక గీత ఆర్ట్స్ సంస్థలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈయన నిర్ణయాలతో ఆ సంస్థకు ఎన్నో విజయాలు దక్కాయి. అలాగే అల్లు అరవింద్  , బన్నీ వాసు ఎంతో నమ్మకంగా ఉండడంతో గీత ఆర్ట్స్ సంస్థకు సంబంధించిన దాదాపు పెద్ద పెద్ద బాధ్యతలను ఈయనకు అప్పగించాడు. దానితో బన్నీ వాసు బయటివాడు అయినా కూడా గీత ఆర్ట్స్ సంస్థలో కీలకమైన వ్యక్తిగా మారిపోయాడు. ఇక ఈయన నిర్ణయాలతో గీత ఆర్ట్స్ సంస్థ ఇప్పటికి కూడా ఎంతో గొప్పగా ముందుకు సాగుతుంది.

ఇది ఇలా ఉంటే తన ఆలోచనకు అనుగుణంగా ఉండే సినిమాలను కొన్ని ఈయన నిర్మించడానికి , డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రస్తుతం ఆసక్తి చూపిస్తున్నాడు. దానితో ఈయన గీతా ఆర్ట్స్ నుండి బయటకు వచ్చాడేమో అనుకోకండి. కేవలం ఆయన టేస్ట్ కు తగ్గ సినిమాలను ప్రజల ముందుకు తీసుకురావడం కోసమే ఈయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం ఈయన మిత్ర మండలి అనే సినిమాని రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది.

తాజాగా ఈయన వంశీ నందిపాటితో కలిసి లిటిల్ హార్ట్స్ అనే సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాడు. వంశీ నందిపాటికి మంచి టేస్ట్ ఉంది అని , ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు మంచి విజయాలు అందుకుంటాయి అనే టాక్ ఇండస్ట్రీ లో ఉంది. ఇక వంశీ నందిపాటి చిన్న సినిమా అయినా లిటిల్ హాట్స్ మంచి విజయం సాధిస్తుంది అని ముందే ఊహించి ఆ సినిమాను బన్నీ వాసు కు చూపించి అది అతనికి నచ్చడంతో ఆయనతో పాటు కలిసి ఇద్దరూ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుగోలు చేశారు. 2.5 కోట్ల దరకు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను వీరిద్దరు కొనుగోలు చేయగా రెండు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని మొత్తంగా ఈ సినిమా 10 కోట్ల వరకు షేర్ కలక్షన్లను వసూలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. దానితో ఈ చిన్న సినిమా ద్వారా వీరిద్దరికి జాక్పాట్ తగిలింది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: