
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన టిడిపి ,జనసేన ఎంపీలతో భేటీ అయి వారందరూ కూడా ఎన్డీఏలో భాగమైన బిజెపి ప్రభుత్వానికి ఓటు వేసేలా శిక్షణ ఇచ్చారు నారా లోకేష్. వాస్తవానికి ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసే విధానం చాలా విభిన్నంగా ఉంటుందట. అందుకే టిడిపి ఎంపీలకు ఈ విధానంపై నారా లోకేష్ శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి బిజెపి సీనియర్ నాయకులతో కూడా నారా లోకేష్ భేటీ అయినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పైన అక్కడ మంత్రులతో నారా లోకేష్ చర్చించినట్లు సమాచారం. ప్రధాన మోదీ తో కూడా సుమారుగా గంటసేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, అభివృద్ధి విషయం, ఆర్థిక సహాయం పైన చర్చించినట్లు సమాచారం. ఈరోజు ఉదయం 8 గంటలకు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి.
అయితే వాస్తవంగా సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా రేపటి రోజున అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా ఢిల్లీ పర్యటనను రద్దుచేసుకొని తన కుమారుడు నారా లోకేష్ ని పంపించారు. ఇలా పంపించడం వెనక కూడా రాజకీయ వ్యూహం ఉందనే విధంగా వినిపిస్తున్నాయి. నాలుగు నెలల వ్యవధిలోనే నారా లోకేష్ మోదీనీ రెండుసార్లు కలిసారు. నారా లోకేష్ తరచూ ఢిల్లీకి వెళ్లడం వెనుక ఒక భారీ వ్యూహం ఉన్నట్లు వినిపిస్తోంది. ఎవరు అవునన్నా కాదన్నా టిడిపి పార్టీకి చంద్రబాబు తర్వాత నారా లోకేష్ బాధ్యతలు తీసుకోబోతున్నారని అందుకే బీజేపీ పార్టీతో కూడా లాంగ్ ట్రావెల్ చేయాలని చూస్తోంది. ఇలా రెండు పార్టీల మధ్య పరస్పర ప్రయోజనాల కోసము, చంద్రబాబు తన తర్వాత నారా లోకేష్ అన్ని బాధ్యతలు తీసుకుంటారనే విధంగా హింట్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది.