ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోలతో పోలిస్తే ప్రభాస్ చాలా సినిమాలకు కమిట్ అయి ఉన్నాడు. ఒక సినిమా షూటింగ్లో పాల్గొంటూనే మరొక సినిమాకు కమిట్ అవుతున్నాడు. వీలైతే ఆ సినిమా షూటింగ్లలో కూడా పాల్గొంటున్నాడు. ఇక ప్రభాస్ నటిస్తున్న సినిమాలు కూడా వరుస పెట్టి విడుదల అవుతూ వస్తున్నాయి. కానీ ప్రభాస్ కి ఊహించని కారణాల వల్ల కొన్ని సినిమాలు డిలే అవుతూ రావడంతో ఆయన కాల్షిట్ల ప్రాబ్లం ఏర్పడుతున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం ప్రభాస్ , మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ , హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్లలో పాల్గొంటూనే ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సాలార్ 2 , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2 , సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాలకు కమిట్ అయ్యాడు. ఇక ఇప్పటికే అన్ని అనుకున్నట్లు జరిగితే స్పిరిట్ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కల్కి , రాజా సాబ్ సినిమాల సమయంలో జరిగిన కొన్ని డిలేల కారణంగా ఆ సినిమాల షూటింగ్లు అనుకున్న సమయానికి జరగకపోవడంతో ఇప్పటికి స్పిరిట్ సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు అని తెలుస్తుంది.

ఇక సందీప్ రెడ్డి వంగ మాత్రం యానిమల్ సినిమా పూర్తి చేసుకుని ఎప్పుడు ప్రభాస్ కాల్ షీట్లు ఇస్తాడా అని వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ , తారక్ తో సినిమా పూర్తి కాగానే ప్రభాస్ తో సలార్ 2 సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాడు. ఇక మరో వైపు నాగ్ అశ్విన్ కూడా కల్కి 2 మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి మరికొన్ని రోజుల్లోనే షూటింగ్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రస్తుతం ప్రభాస్ కాల్షీట్ల కోసం ముగ్గురు దర్శకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: