సోషల్ మీడియా యుగంలో చిన్న విషయాలు కూడా పెద్ద రాదాంతాలకు దారి తీస్తున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే విషయం మరోసారి నిరూపితమైంది. అంత చిన్న విషయాన్నికూడా ఇంత పెద్ద ఇష్యూగా మార్చేస్తారా అని ఆశ్చర్యపోతున్నారు సినీ అభిమానులు, ముఖ్యంగా అక్కినేని అభిమానులు. ఈ వివాదానికి కారణం ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్. తెలుగు సినీ పరిశ్రమలో మహేష్ బాబు ఎంత సింపుల్‌గా, కాంట్రవర్సీలకు దూరంగా ఉండే వ్యక్తి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఎప్పుడూ తన పనిపైనే దృష్టి పెడతారు. ఎవరికీ కీడు చేయకుండా అందరితో స్నేహంగా, మృదువుగా మెలుగుతారు. అటువంటి వ్యక్తి చేసిన ఒక సాధారణ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది.


ఇటీవల జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు తన సోషల్ మీడియా ఖాతాలో పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేసి ఆయనకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, మహేష్ బాబు అభిమానులు ఈ పోస్ట్‌ను ఎంతో సంతోషంగా స్వాగతించారు. కానీ అదే పోస్ట్ అక్కినేని అభిమానులలో మాత్రం తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. దీనికి కారణం మహేష్ బాబు షేర్ చేసిన ఫోటో. ఆ ఫోటోలో అసలు నాగార్జున కూడా ఉన్నారు. కానీ మహేష్ బాబు ఆ ఫోటోను క్రాప్ చేసి కేవలం తనతో పాటు పవన్ కళ్యాణ్ ఉన్న భాగాన్ని మాత్రమే పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో మహేష్ బాబు నాగార్జునను కావాలనే అవమానపరిచారని, ఆయనకు గౌరవం ఇవ్వలేదని కామెంట్లు రావడం మొదలయ్యాయి. “పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వడం మానేశారా?”, “ఇది సరైన పని కాదు” అంటూ నాగార్జున అభిమానులు మండిపడుతున్నారు.



కానీ సాధారణ సినీ ప్రేక్షకులు మాత్రం వేరే విధంగా స్పందిస్తున్నారు. “ఇది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కాబట్టి ఆయనతో ఉన్న ఫోటోను షేర్ చేశారు. అదే నాగార్జున పుట్టినరోజు అయితే ఆయనతో ఉన్న ఫోటోను పోస్ట్ చేసేవారు. దీనికి ఇంత పెద్ద వివాదం ఎందుకు?” అని ప్రశ్నిస్తున్నారు. చాలా మంది మహేష్ బాబు మీద కావాలనే ఈ రకమైన ట్రోలింగ్ జరుగుతోందని సోషల్ మీడియాలో వాదిస్తున్నారు. ఈ వివాదంపై మహేష్ బాబు కానీ, నాగార్జున కానీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇద్దరూ తమ తమ పనుల్లో బిజీగా ఉంటూ ఈ చిన్న విషయాలను పట్టించుకోవడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం ఇప్పటికీ చర్చనీయాంశంగా మారి అభిమానులను రెండు వర్గాలుగా విడగొట్టేసింది.



మొత్తం చూసుకుంటే, సోషల్ మీడియా యుగంలో ఒక చిన్న క్రాప్ చేసిన ఫోటో కూడా ఎంత పెద్ద రాదాంతానికి దారి తీస్తుందో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తోంది. మహేష్ బాబు లాంటి సింపుల్ స్టార్‌లను కూడా టార్గెట్ చేయడానికి అభిమానులు, ట్రోల్స్ ఎంత చిన్న విషయాన్నైనా పెద్దదిగా చూపిస్తున్నారనే వాస్తవం ఈ వివాదం ద్వారా మళ్లీ రుజువైంది.




మరింత సమాచారం తెలుసుకోండి: