
టాలీవుడ్ స్టార్ నిర్మాతలలో ఒకరు అయినటువంటి అశ్విని దత్ , రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా రామ్ గోపాల్ వర్మ ను సంప్రదించగా ఆయన కూడా అందుకు ఒప్పుకొని అశ్విని దత్ కి రంగీలా , గోవిందా గోవిందా అనే రెండు సినిమా కథలను వినిపించాడట. ఇక రామ్ గోపాల్ వర్మ ఎక్కువ శాతం రంగీలా వైపే మొగ్గు చూపెడట. ఇక ఆ సినిమాలో చిరంజీవి , రజనీ కాంత్ ను హీరోలుగా తీసుకోవాలి అనుకున్నాడట. కానీ అశ్విని దత్ మాత్రం చిరంజీవి , రజనీ కాంత్ ఆ సినిమాలో నటించిన వారు అతిథి పాత్రల్లో ఉండిపోతారు అనే ఉద్దేశంతో ఆ కథతో వద్దు అని అన్నాడట. దానితో ఆ సినిమాను పక్కన పెట్టి అశ్విని దత్ బ్యానర్లో రామ్ గోపాల్ వర్మ "గోవిందా గోవిందా" మూవీ చేశాడట. అలా రామ్ గోపాల్ వర్మ , అశ్విని దత్ బ్యానర్లో చిరంజీవి , రజనీ కాంత్ హీరోలుగా మొదట రంగీలా అనే సినిమాని రూపొందించాలి అనుకున్నాడట. కానీ ఆ తర్వాత ఆమీర్ ఖాన్ , టైగర్ ష్రూఫ్ హీరోలుగా ఈ మూవీ ని రూపొందించాడట. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని ఆ సమయంలో సొంతం చేసుకుంది.