ఏంటి కాజల్ అగర్వాల్ కి యాక్సిడెంట్  అయిందా.. ఇది నిజమేనా.. కాజల్ అగర్వాల్ కార్ యాక్సిడెంట్లో తీవ్ర గాయాల పాలైనట్టు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.. మరి నిజంగానే కాజల్ అగర్వాల్ కి యాక్సిడెంట్ అయిందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు ఎక్కువైపోయాయి.జరిగింది జరగనట్లు జరగంది జరిగినట్లు చూపిస్తూ చూసే వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నారు.. ఇప్పటికే సోషల్ మీడియాని నమ్మి చాలామంది మోసపోయారు.. అలా తాజాగా కాజల్ అగర్వాల్ కి యాక్సిడెంట్ అయిందని ఐసీయూలో ఉంది అని ఇలా ఎన్నో దుష్ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. కొంతమంది యూట్యూబర్లు అయితే థంబ్ నెయిల్స్ పెట్టి మరీ కారు యాక్సిడెంట్లో తీవ్ర గాయాల పాలైన కాజల్ అగర్వాల్ అంటూ దారుణమైన రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే తనకు యాక్సిడెంట్ అయింది అంటూ వస్తున్న వార్తలపై కాజల్ అగర్వాల్ క్లారిటీ ఇచ్చింది.కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. నాకు ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు. యాక్సిడెంట్ అయిందంటూ నా మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుంది.కానీ ఇవన్నీ ఫేక్ వార్తలు. ఇలాంటి ఫేక్ ప్రచారాలు చూస్తున్నప్పుడు కాస్త ఫన్నీగా ఉంటాయి. ప్రస్తుతం ఆ దేవుడి దయతో నేను చాలా సురక్షితంగా ఉన్నాను. ఫేక్ ప్రచారాలపై దృష్టిని పెట్టకుండా నిజాలపై ఫోకస్ పెడితే బాగుంటుంది.. అంటూ కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.అలా తనకు యాక్సిడెంట్ అయింది అంటూ వస్తున్న వార్తలని కాజల్ ఖండించింది.. ఇక కాజల్ అగర్వాల్ ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఎక్కువగా బిజీగా ఉండడం లేదు. గత ఏడాది కమల్ హాసన్ తో నటించిన భారతీయుడు 2 మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవ్వడంతో కాజల్ అగర్వాల్ కలలన్ని కల్లలైపోయాయి.

ఎందుకంటే తన సెకండ్ ఇన్నింగ్స్ లో భారతీయుడు 2 వంటి బిగ్గెస్ట్ మూవీలో నటిస్తే తన కెరీర్ కి ప్లస్ అవుతుంది అనుకుంది.కానీ ఈ సినిమా డిజాస్టర్ అవ్వడం అలాగే ఈ సినిమాలో కాజల్ పాత్ర ఎక్కువ లేకపోవడం ఆమెకు మైనస్ గా మారింది. ఇక ఈ ఏడాది విడుదలైన కన్నప్ప మూవీలో కాజల్ అగర్వాల్ పార్వతీదేవి పాత్రలో నటించి విమర్శలపాలైంది.అలాగే బాలీవుడ్ లో రాబోతున్న రామాయణం మూవీలో కాజల్ నటిస్తున్నట్టు టాక్.అలాగే తమిళ, కన్నడ సినిమాల్లో కూడా కాజల్ అగర్వాల్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: