
ఈ ఏడాది మార్చిలో రూ .6200 కోట్ల రూపాయల ప్రభుత్వ ఉద్యోగులకు విడుదల చేసింది. CCS,GPF,APGAI కింద బకాయిలను విడుదల చేశారు. ఈ ఏడాది జనవరిలో సిపిఎస్ ఉద్యోగులకు కూడా రూ.1,033 కోట్ల రూపాయల బకాయిలను కూడా రిలీజ్ చేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు రూ .25 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ చెల్లించలేదు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం వారికి విడతల వారీగా బకాయిలను క్లియర్ చేసేలా చూస్తున్నారు.
మరొకవైపు ఉద్యోగులు కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ కోరుకుంటున్నారు. ఎన్నికల ముందు కూటమి ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు ఉద్యోగ సంఘాలు. ఇటీవలే ఇందుకు సంబంధించి ధర్నా కూడా విజయవాడలో చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది కూడా సెప్టెంబర్ ఒకటవ తేదీన సిపిఎస్ ఉద్యోగులకు బ్లాక్ డే గా పరిగణిస్తూ నిరసనలు చేపడుతూ ఉన్నారు.. సెప్టెంబర్ 1 - 2004 తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో చేరిన వారికి సిపిఎస్ అమలు అవుతుంది.2004 కంటే ముందు చేరిన వారికి పాత పెన్షన్ విధానం అమలవుతుంది. అందుకే సిపిఎస్ ఉద్యోగులు ఆ తేదీని బ్లాక్ డే అంటూ నిరసనలు చేస్తూ ఉంటారు.