రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక విషయంపై తనదైన శైలిలో స్పందిస్తూ తరచూ వార్తల్లో ఉండే వైఎస్ షర్మిల, ఈ మధ్య కాలంలో తన దూకుడును మరింత పెంచారు. రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతూ ఆమె వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి.

 ముఖ్యంగా టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) గుళ్ల గురించి షర్మిల చేసిన వ్యామ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యల విషయంలో ఆమె తీరును పలువురు తప్పుబడుతున్నారు. షర్మిల వ్యాఖ్యల పట్ల సీబీఐ మాజీ డైరెక్టర్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారని తెలుస్తోంది. షర్మిల చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో ఆమె ప్రస్తుతం సభ్యురాలిగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు మౌనంగా ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 కాంగ్రెస్ పెద్దలు ఆమె వ్యాఖ్యల విషయంలో స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు, ఇతర వర్గాల ప్రజలు బహిరంగంగా కోరుతున్నారు. ఒక జాతీయ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న నాయకురాలు మతపరమైన అంశాలపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఈ అంశంపై ఇంకో ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యల పట్ల స్పందిస్తారా లేదా అనేదే ఆ చర్చ సారాంశం.

 పవన్ కళ్యాణ్ ఎప్పుడూ హిందూ ధర్మం, దైవభక్తి గురించి ప్రస్తావిస్తుంటారు కాబట్టి, షర్మిల చేసిన వ్యాఖ్యల విషయంలో ఆయన స్పందించే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఈ మొత్తం పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ మరియు పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. షర్మిల  కొన్ని విషయాలకు సంబంధించి మారాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పవచ్చు. షర్మిల ప్రణాళికలు ఏ విధంగా  ఉంటాయో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: