చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామందికి ఈ మధ్యకాలంలో తరచూ ఎక్కువగా మధుమేహ సమస్యలు వెంటాడుతున్నాయి. దీనివల్ల చిన్న వయసు నుంచే ఇంజక్షన్స్, టాబ్లెట్ వంటి వాటిని ఉపయోగించడం వల్ల సైడ్ ఎఫెక్టులు కూడా వస్తున్నాయి. కానీ షుగర్ పేషెంట్ల రక్తంలో ఉండే చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఒక ఆకుకూర కలదు. మరి ఆకు కూర ఏంటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.

ఇదివరకు రోజులలో ప్రజలు ఇంటిదగ్గరే ఎర్ర బచ్చలి ఆకుకూరను పండిస్తుండేవారు. చాలామంది ఎర్ర బచ్చలి ఆకుకూరలను తింటూ ఉండేవారు. ఇందులో ఇనుము పుష్కలంగా లభిస్తుంది ,అలాగే హిమోగ్లోబిన్ పెంచడంలో కూడా సహాయపడుతుంది , రక్తహీనతను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇలా ఇవే కాకుండా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి.

1).ఇందులో కెరోటిన్చ ,విటమిన్ A, పుష్కలంగా ఉంటుంది వీటి వల్ల కంటి ఆరోగ్యానికి చాలా  మంచిది.

2).ఈ ఎర్ర బచ్చలి కూరలలో ఎక్కువగా ఫైబర్ ఉండడం వల్ల జీర్ణ ప్రక్రియ కూడా సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్ధక సమస్యతో, గ్యాస్ సమస్యతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వారిని ఉపశమనం పొందేలా చేస్తుంది.

3).ఈ ఎర్ర బచ్చలి ఆకుకూరలలో కేలరీలు తక్కువగా ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మధుమేహ వ్యాధి గ్రహస్తులకు ఇది ఒక దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో చాలా తక్కువగా గ్లైసిమిక్ ఉండడం వల్ల రక్తంలో చక్కెర వేగాన్ని పెంచకుండా చేస్తుంది. అలాగే గ్లూకోజ్ సోషనను కూడా తగ్గిస్తుందట.

4).ఎర్ర బచ్చలి ఆకుకూరలలో ఉండేటువంటి ఐరన్ గర్భిణి మహిళలు తింటే శిశువు అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇలాంటి వాటిని తినేటప్పుడు వైద్యులను మహిళలు సంప్రదించడం మంచిది.


5).అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు ఎర్ర బచ్చలి ఆకుకూరను ఫ్రైగా చేసుకుని తినడం వల్ల బరువు తగ్గుతారు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండినట్లుగా ఉంచుతుంది. దీనివల్ల ఆకలి బాధ ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: