తెలంగాణలో జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చాలా ఆసక్తి నెలకొంది. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనేది చెప్పడం కష్టంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్, బబీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రధానంగా పోటీ చేయబోతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిని ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి కూడా అభ్యర్థి ఫైనల్ అయిపోయాడు. ఇదే తరుణంలో బీజేపీ నుంచి  టికెట్ ఎవరికి ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది..ఈ సీటు ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ కంకణం కట్టుకొని కూర్చుంది. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి హైదరాబాదులో ఇప్పటివరకు ఎక్కువ పట్టు సాధించలేక పోతుంది. అయితే ఈ ఎన్నికలో విజయం సాధిస్తే హైదరాబాదులో కూడా కాంగ్రెస్ కు పట్టు దొరుకుతుందని ఆలోచనలో పడింది. 

ఇదే క్రమంలో బీఆర్ఎస్ ఇంతకుముందు నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ ను నిలబెట్టి విజయం సాధించింది. ఆయన గుండెపోటుతో మరణించడంతో ఇక్కడ ఉపఎన్నిక ఖరారైంది. ప్రస్తుతం ఇదే సీటును తన భార్యకు ఇవ్వడంతో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని బీఆర్ఎస్ భావిస్తుంది. అంతేకాదు ఈ మూమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మళ్ళీ పార్టీలో కొత్త ఊపు వచ్చి కాంగ్రెస్ కు మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇదిలా నడుస్తున్న సమయంలోనే బీజేపీ ఎలాగైనా గెలవాలని కొత్త అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత మొదటి ఎన్నిక కాబట్టి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ నుంచి  కీలకంగా వారి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి వారు ఎవరు అనే వివరాలు చూద్దాం..

 జూబ్లీహిల్స్ నియోజకవర్గ స్థాయి నుంచి పూర్తిగా పరిశీలన చేసి ముగ్గురి పేర్లను ఫైనల్ చేశారు. ఇందులో లంకల దీపక్ రెడ్డి, వీరపనేని పద్మ కీర్తి రెడ్డి ఉన్నట్టు సమాచారం. అయితే ఇందులో గత ఎన్నికల్లో దీపక్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అంతేకాదు ఈయనకు రాష్ట్ర అలాగే ఢిల్లీ  స్థాయి నాయకులతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి దీపక్ రెడ్డి పేరుని పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అక్కడ మహిళకు ఇవ్వాలనుకుంటే మాత్రం తప్పకుండా పద్మా కీర్తి రెడ్డికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ బీజేపీ నుంచి ఈ ముగ్గురి పేర్లలో ఎవరో ఒకరి పేరు రేపటికల్లా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: