
అయితే, “కాంతార: చాప్టర్ 1” సినిమా ఈ సాంప్రదాయాన్ని పూర్తిగా మార్చింది. ఈ సినిమా రిలీజ్ అవ్వగానే, బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేసింది. వీకెండ్ మాత్రమే కాక, వర్కింగ్ డేస్‌ల్లో కూడా సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు ఉన్న హీట్, ప్రేక్షకుల మాస్ రచ్చ, మాస్ హోల్డ్ ఆకర్షణ కారణంగా, అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లకు చేరడంతో సూపర్ డూపర్ హిట్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. వర్కింగ్ డేస్‌లో అడుగుపెట్టిన కాంతార: చాప్టర్ 1 సినిమా, ఆరు రోజుల వ్యవధిలో సెన్సేషనల్ రికార్డులు సృష్టిస్తూ బాక్స్ ఆఫిస్ వాద మాస్ డివైన్ హిట్‌గా నిలిచింది. కేవలం కన్నడ లో మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుంది.
తాజా గా ఆరవ రోజు లెక్కలని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో రిషిబ్ శెట్టి ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేస్తున్నారు. “కాంతార: చాప్టర్ 1” మొత్తం 427 కోట్ల రూపాయల క్రాస్ కలెక్షన్స్ సాధించింది. కర్ణాటక బాక్స్ ఆఫీస్ హిస్టరీలో, ఇంత త్వరగా ఇన్ని కోట్ల కలెక్షన్స్ సాధించిన ఏకైక సినిమా గా చరిత్ర సృష్టించింది. ఆరు రోజుల్లో 427 కోట్లు సాధించడం, గంభీరమైన రికార్డు గా చరిత్రలో నిలిచిపోయింది. సోషల్ మీడియా వేదికపై కూడా “కాంతార” పేరు మరొకసారి హాట్ టాపిక్‌గా మారింది. సినిమా కోసం ఎటువంటి భారీ ప్రమోషన్స్ కూడా చేయకపోయినప్పటికీ, ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్ మరియు కధ వల్ల బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ విజయ పరంపర కొనసాగుతూనే ఉంటుంది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. తాజా గా రిలీజ్ చేసిన పోస్టర్‌లో రిషిబ్ శెట్టి పవర్‌ఫుల్ ఎక్స్‌ప్రెషన్‌తో అభిమానులను ఆకర్షించాడు. కాంతార టీం ఫుల్ ఖుషీ ఖుషీగా ఉంది..!!
