
రాష్ట్ర ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయం కోసం భూమిని కేటాయించింది. ఈ సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారాన్ని కిషన్ రెడ్డి కొనియాడారు. ఈ విశ్వవిద్యాలయం ములుగు ప్రాంతంలో గిరిజనుల అభివృద్ధికి ఊతం ఇస్తుందని ఆశాభావం వ్యక్తమైంది. భవన నిర్మాణం త్వరితగతిన ప్రారంభించాలని ధర్మేంద్ర ప్రధాన్‌ను కిషన్ రెడ్డి కోరారు.ఈ విశ్వవిద్యాలయం కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల గిరిజనులకు సేవలు అందిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం రూ.800 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా కొత్త కోర్సులను రూపొందించాలని ఆయన సూచించారు. గిరిజన భాషల్లో పాఠ్యాంశ బోధన, ఆయుర్వేద విలువలు, గిరిజన ఆహార విధానాలపై కోర్సులు అందించాలని కోరారు. ఈ విశ్వవిద్యాలయం పరిశోధనలకు, సృజనాత్మకతకు వేదికగా మారాలని ఆయన ఆకాంక్షించారు. ములుగు ప్రాంత యువతలో క్రీడా నైపుణ్యాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఈ సంస్థ గిరిజనుల విద్యా అవసరాలను తీర్చడంతో పాటు వారి సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని అంచనా.లోగో రూపకల్పనలో స్థానిక గిరిజన భాషల పదాలను చేర్చడం అద్భుతమైన నిర్ణయమని ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. ఈ లోగో సృజనాత్మకతకు ప్రతీకగా నిలిచింది. సమ్మక్క సారలమ్మ పేరు గిరిజన సంస్కృతికి గౌరవం ఇస్తూ విద్యా రంగంలో కొత్త బ్రాండ్‌గా మారనుంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు