టాలీవుడ్ ,బాలీవుడ్లో ఎన్నో చిత్రాలలో నటించి హీరోయిన్గా పేరు సంపాదించిన పాయల్ ఘోష్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 2009లో ప్రయాణం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్టీఆర్ తో ఊసరవెల్లి చిత్రంలో తమన్నా ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది. ఆ తర్వాత మిస్టర్ రాస్కెల్, తదితర చిత్రాలలో నటించింది.అయితే నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల బోల్డ్ కామెంట్స్ తో వార్తలు లో నిలుస్తూ ఉంటుంది. ఇలాంటి క్రమంలోనే తన శృంగార జీవితం పైన తాజాగా ఈమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి.



ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పాయల్  ఘోష్ గతంలో ఇర్ఫాన్ పఠాన్ తో తాను ఐదేళ్లపాటు డేటింగ్ చేశానని, కానీ మధ్యలో తనని మోసం చేసి వెళ్లిపోవడంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను, ఆ బాధలో తాను తొమ్మిదేళ్లపాటు శృంగార జీవితానికి దూరంగా ఉన్నానంటూ తెలియజేసింది. ఇర్ఫాన్ పఠాన్ తర్వాత గౌతమ్ గంభీర్ కూడా తనకి అప్పుడప్పుడు మెసేజ్లు చేసేన వారికి తాను ఎలాంటి విషయాలకు రిప్లై ఇవ్వలేదని తెలియజేసింది.


మధ్యలో ఒక వ్యక్తి తనతో శారీరకంగా కలిసేందుకు ప్రయత్నాలు చేసిన తాను పట్టించుకోలేదంటూ క్లారిటీ ఇచ్చేసింది. తనకి శారీరకంగా కలవడం మీద గౌరవం ఉందని తాను ఎవరితోనూ ఎలాంటి తప్పుడు పనులు చేయలేదంటూ తెలియజేసింది పాయల్ ఘోష్. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ డైరెక్టర్  అనురాగ్ కశ్యప్ తన లైంగికంగా వేధించారనే ఆరోపణలు చేయడంతో అప్పటినుంచి ఈమె పేరు బాలీవుడ్ లో సంచలనంగా మారింది. నిరంతరం అప్పుడప్పుడు ఈమె ఇండస్ట్రీ పైన చేసే కామెంట్స్ సంచలనంగా మారుతుంటాయి ముఖ్యంగా మీటూ ఉద్యమం పైన కూడా తీవ్ర ఆరోపణలు చేసిన సంఘటనలు ఇంకా ఇప్పటికి వినిపిస్తుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: