
ఈ క్రమంలో పాట్నాలో బీజేపీ ఎన్నికల కమిటీ మూడవ సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్, సీనియర్ నేతలు పాల్గొని సీట్ల పంపకాలు, అభ్యర్థుల జాబితాపై చర్చించారు. మరోవైపు జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తుది అభ్యర్థుల ఎంపికకు తుది చర్చలు చేస్తున్నారు.ప్రతిపక్ష మహా కూటమి కూడా ఈసారి గెలుపు లక్ష్యంగా సీరియస్‌గా సీట్ల కసరత్తు ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ తన సెంట్రల్ ఎలెక్షన్ కమిటీ సమావేశం న్యూఢిల్లీలో నిర్వహిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ రామ్ మాట్లాడుతూ - పార్టీ వాటాలో వచ్చే సీట్లను ఖరారు చేయడంపై చర్చ జరుగుతోందని తెలిపారు. ఆర్జేడీ మాత్రం 150 సీట్లకు పోటీ చేసి మిగిలిన 93 సీట్లను మిత్రులకు ఇవ్వాలని చూస్తోంది. ఇక కాంగ్రెస్ వంద సీట్లు కావాలని డిమాండ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో మహా కూటమి ఎన్నికల సమన్వయ కమిటీ కీలక సమావేశం తేజస్వి ప్రసాద్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. సీపీఐ, సీపీఐ(ఎంఎల్) కూడా గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. గత ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని గుర్తు చేస్తూ మరింత బలమైన స్థానం కోరుతున్నాయి. ఒకవైపు ఎన్డీఏలో ఎల్‌జెపి అసంతృప్తి, మరోవైపు మహా కూటమిలో కాంగ్రెస్-ఆర్జేడీ సీట్ల పంచాయతీ. రెండు శిబిరాల్లో కూడా సీట్ల అంశం ఎన్నికల హీట్ పెంచేస్తోంది. ఎవరికీ ఎంత సీటు దక్కుతుందో… ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో… రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది. ఇప్పటికి మాత్రం బీహార్ రాజకీయాల్లో “సీటు” పంచాయతీ హాట్ టాపిక్ గా మారింది.