
బాధితులతో నేరుగా మాట్లాడి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని తాను భావిస్తున్నానని తెలియజేశారు విజయ్ . అయితే ఇప్పటికే విజయ్ తన వీడియో కాల్ ద్వారా బాధిత కుటుంబాలతో కూడా మాట్లాడి వారి కుటుంబాలకు ధైర్యం చెప్పిన సంగతి తెలిసిందే.. అంతేకాకుండా కుటుంబాలకు నష్టపరిహారాన్ని కూడా ప్రకటించారు. స్వయంగా బాధితులను కలవాలని పోలీసుల అనుమతి కోసం ప్రయత్నాలు చేశారు. కానీ పోలీసుల నుంచి అనుమతి రాలేదు.తొక్కిసలాటలో ఘటన పైన హీరో విజయ్ ఆలస్యంగా రావడానికి ముఖ్య కారణం అంటూ ఇప్పటికే పోలీసులు ఆరోపణలు చేశారు. ఈ ఘటన పైన విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో పర్యటనకు అంగీకరించలేదనే ఊహగానాలు కూడా వినిపిస్తున్నాయి. అటు విజయ్, స్టాలిన్ ప్రభుత్వ మధ్య ఒక మాటల యుద్ధం జరుగుతోంది.
స్టాలిన్ ప్రభుత్వం మాత్రం మళ్లీ అలాంటి తొక్కిసలాట జరుగుతుందని భావించాము కాబట్టే పర్మిషన్ ఇవ్వలేదంటూ తెలియజేస్తున్నారు.నువ్వు సినిమా యాక్టర్ వి, నీవెనకాల జనం పెద్ద ఎత్తున వస్తారు వారిని కంట్రోల్ చేయడం అధికారుల వల్ల కావడం లేదని తెలుపుతున్నారు. ఈ విషయాలపైన అటు స్టాలిన్, టీవీకే పార్టీ అధినేత విజయ్ మధ్య జరుగుతున్న అండర్స్టాండింగ్ ఇది అంటూ బిజెపి పార్టీ మరొక వాదనను తెరపైకి తీసుకువచ్చింది. పరామర్శకు వెళ్లడం కోసం విజయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మరి సుప్రీంకోర్టు ఓకే అంటుందో లేదో చూడాలి మరి.