జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు ప్రెస్టేజ్ గా తీసుకొని మరి ముందుకు వెళుతున్నాయి. అయితే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ప్రధానమైనది మైనారిటీ ఓటు బ్యాంకు. అయితే ఇప్పుడు ఆ ఓటు బ్యాంకుకు గండి పడనుందా ?అంటే అవునని రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం ఓట్లలో 24% పైగా మైనార్టీ ఓట్లు కలవు. ముఖ్యంగా అక్కడ అభ్యర్థుల గెలుపు ఓటముల పైన తీవ్రస్థాయిలో ప్రభావాన్ని చూపిస్తుంది. అధికార పార్టీ కాంగ్రెస్, బిఆర్ఎస్, మజ్లిస్ పార్టీకి ముస్లిం ఓట్లలో గట్టిపట్టు ఉన్నది. అయితే ఈసారి ఈ ఉప ఎన్నికలకు మజ్లీస్ పార్టీ దూరం కాబోతున్నట్లు వినిపిస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. ఈ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కి కలిసొచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


అయితే బిఆర్ఎస్ పార్టీ కూడా ముస్లిం  ఓటు బ్యాంకు పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది, ఈ నేపథ్యంలోనే  సోషల్ వర్కర్ అయినా సల్మాన్ ఖాన్ ఎన్నికల బరిలో దిగబోతుండడంతో అక్కడ ప్రధాన ఓటు బ్యాంకింగ్ అయిన  మైనార్టీ ఓట్ల  పైన చాలా ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. అక్కడ స్థానికుడై ఉండి సల్మాన్ క్రౌడ్ ఫండింగ్ తో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని, ముఖ్యంగా మైనార్టీలలో నిరుపేదలలో గట్టి పట్టు ఉంది. ఒకవేళ సల్మాన్ ఎన్నికల బరిలో ఉంటే ఖచ్చితంగా 20% పైగా కుటుంబాలు అతని వైపు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.




ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3.98 లక్షల ఓటర్లు ఉంటే అందులో 96 వేలకు పైగా మైనార్టీ ఓట్లే కలవు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మైనార్టీ ఓటర్ల గెలుపు ఓటములను నిర్ణయించే అవకాశం ఎక్కువగా ఉన్నది.సల్మాన్ ఖాన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నిలవడం అన్ని పార్టీలకు మింగుడు పడని అంశంగా మారిపోయింది. మరి ఉప ఎన్నికలలో ఎవరు గెలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: