టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ఒకవైపు హీరో గానే కాకుండా ,మరొకవైపు పొలిటికల్గా కూడా హిందూపురం ఎమ్మెల్యేగా బాధ్యతలను వ్యవహరిస్తూ ముందుకు వెళుతున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీను , బాలయ్య కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ విడుదలవ్వడంతో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. బాలయ్య తదుపరి చిత్రం డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నటించబోతున్నారు.

ఈనెల 24న ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా మొదలు కాబోతున్నాయి. అనంతరం ఈ సినిమా షూటింగును కూడా అదే రోజున ప్రారంభించబోతున్నట్లు సమాచారం. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరొకసారి వీరి కాంబినేషన్లో సినిమా రాబోతుండడం పై అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఫీలవుతున్నారు. NBK - 111 అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు.


ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు. ఒకటి మాఫియా డాన్ లాగా, మరొకటి రాజుల కాలం నాటి యోధుడి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కథ రెండు కాలాలలో నడుస్తుందని, ప్రస్తుత కాలంలో కథ మొదలై, ద్వితీయార్థంలో సరికొత్త మలుపు తీసుకుని , వందల ఏళ్ల వెనక్కి రాజుల కాలం కథకి వెళుతుందట.ఇక సెకండ్ హాఫ్ మొత్తం కూడా యాక్షన్ ఎలిమెంట్స్ తో ఉండేలా డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. డైలాగులు మినహా సినిమా స్క్రిప్ట్ అంతా పూర్తయిందని. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల వివరాలను అధికారికంగా చిత్ర బృందం తెలియజేయబోతోంది. ఈ మధ్య బాలకృష్ణ ఎక్కువగా ద్విపాత్రాబినయంలోనే కనిపించడానికి మక్కువ చూపుతున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ సినిమా కూడా ఎలా ఉండబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: