
కానీ ఈ విషయం పైన వైసిపి నేతలు విమర్శిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో ఒప్పందం జరుగుతుందని, పెట్టుబడులు వస్తాయని ముఖ్యంగా గూగుల్ నుంచి విశాఖపట్నంకి ఇంత భారీ పెట్టబడులు వస్తాయని ఎవరు ఊహించలేదు. ఇందుకు సంబంధించి ముందస్తు లీకు కూడా ఎక్కడ ఇవ్వలేదు. అయితే గూగుల్ అనుసంద సోషల్ మీడియా నుంచి కొన్ని న్యూస్ బయటికి అయితే వినిపించాయి. అయితే ఈ విషయాల పైన వైసిపి సోషల్ మీడియా హ్యాండిల్ చేసుకొని గూగుల్ సంబంధించి కరస్పాండెంట్, సీఈఓలను, గూగుల్ ప్రతినిధులను ట్యాగ్ చేస్తూ ఏపీలో రాష్ట్రం పరిస్థితులు బాగా లేవు. ఏపీలో శాంతిభద్రతలు లేవు, మహిళలకు భద్రత లేదు మీరు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దండి అంటూ ట్యాగ్ ట్వీట్ చేసేవారట. ఇలా సోషల్ మీడియాలో విపరీతంగా నెగటివ్ ప్రచారం జరిగింది
ఇలాంటి విషయాలతో కూటమి ప్రభుత్వం ఆందోళన చెంది ఇకమీదట ఎలాంటి లీకులు బయటికి రాకూడదని, లోకేష్ అండ్ టీం ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తపడ్డారు. అలా గూగుల్ డేటా సెంటర్ను విశాఖపట్నంకి తీసుకువచ్చారు. దీంతో రాబోయే రోజుల్లో అన్నిటిని కూడా పగడ్బందీ గానే చేసేలా నిర్ణయించుకున్నది కూటమి ప్రభుత్వం. ఈ విషయం వైసిపి వాళ్లకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.. ఎందుకంటే వారు ఇలాంటిది అసలు ఊహించలేకపోయారు. విశాఖపట్నంకి ఇంత భారీ పెట్టుబడులు పెట్టడంతో రాబోయే రోజుల్లో భారీగానే ఐటీ, టెక్ సంస్థలు వస్తాయి. మరో రెండు మూడు ఏళ్లలో విశాఖపట్నం రూపురేఖలు కూడా మారుతాయి.
వైసిపి బలంగా ఉన్న ప్రాంతాలలో అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర. దీంతో నెగిటివ్ ఎలా ప్రచారం చేయాలని విషయంపై పనిగట్టుకొని మరి , ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది గూగుల్ డేటా సెంటర్. కేవలం అక్కడ డేటా సర్వర్లు మాత్రమే ఉంటాయి ,పెద్ద పెద్ద స్టోరేజ్ బ్యాంకులు మాత్రమే ఉంటాయి అక్కడ కేవలం వాచ్మెన్ ఉద్యోగాలు వస్తాయని, ఒక 100 మంది హార్డ్వేర్ ఇంజనీర్లు తో కలుపుకొని మొత్తం మీద ఒక 300 మంది ఉద్యోగాలు తప్ప అక్కడ ఎలాంటి ఉద్యోగాలు రావని ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ గూగుల్ రైడర్ వల్ల విద్యుత్ ఎక్కువ వినియోగిస్తారు, నీటిని ఎక్కువ వాడేస్తారు, దీనివల్ల ఏపీలో ప్రజల పైన కరెంటు చార్జీల భారం పెరుగుతుందని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.
కానీ ఇదే నిజమైతే గతంలో వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆదానితో ఎందుకు ఎంఓయు చేసుకున్నారనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. డేటా సెంటర్ వస్తుంది విశాఖపట్నం కి 35 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారు. 25 వేల ఉద్యోగాలు వస్తాయని గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు అదే వైసిపి నెగిటివ్ ప్రచారం చేస్తోంది.గూగుల్ డేటా సెంటర్ కంటే ఆదాని డేటా సెంటర్ పెద్దదే అంటూ ప్రశ్నిస్తున్నారు కూటమినేతలు.ఈ విషయంపై కూటమినేతలు అంటే గూగుల్ డేటా సెంటర్ వస్తే 300 ఉద్యోగాలే, అదే ఆదాని డేటా సెంటర్ వస్తే 25వేల ఉద్యోగాలు వస్తాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా గూగుల్ డేటా సెంటర్ పైన దుష్ప్రచారం చేస్తున్నారు.ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ వైసిపి నేతలను ప్రశ్నిస్తున్నారు కూటమినేతలు . కూటమినేతలు సోషల్ మీడియాలో కూడా కౌంటర్లు వేస్తున్నారు. కేవలం ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలని వైసిపి సోషల్ మీడియా, హ్యాండిల్స్, వైసీపీ మీడియా, నిపుణులు సైతం ఇలా ప్రచారం చేస్తున్నారు.