
మహేష్ బాబు-నమ్రత ప్రేమ కథ ఒక తెరిచిన పుస్తకం లాంటిదే. వీరి ప్రేమలోని కష్టాలు, విజయాలు ప్రతి ఒక్కరికి తెలిసినవి. ముఖ్యంగా నమ్రతను మహేష్ బాబు పెళ్లికి ఎలా ఒప్పించాడో అది హైలైట్ పాయింట్. వీరు ఫస్ట్‌గా పరిచయం అయిన సందర్భం 2000లో “వంశీ” సినిమా షూటింగ్‌లో అనేది అందరికి తెలుసు. మొదట ఫ్రెండ్షిప్‌గా ఉన్న పరిచయం తరువాత ప్రేమగా మారింది. సినిమా రిలీజ్ అయ్యేకన్నా ముందే వీరు ప్రేమలో పడిపోయారు. అయితే, నమ్రత బాలీవుడ్‌లో ఉన్న అందమైన హీరోయిన్. మహేష్ బాబు తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరో. హైదరాబాదులో స్థిరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్న మహేశ్..బాలీవుడ్ బ్యూటి నమ్రతతో ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమాయణం 2000లో ప్రారంభమై..అలా కంటిన్యూ అయ్యి 2005లో పెళ్లి చేసుకున్నారు. దాదాపు నాలుగేళ్లపాటు వీరు దూరంగా ఉన్నారట. వీళ్లు కమిట్ అయిన సినిమా షెడ్యూల్స్ కారణంగా వారిద్దరూ ఒకరిని ఒకరి దగ్గరగా చూసుకోలేకపోయారట. బిజీ షెడ్యూల్స్ కారణంగా ఫోన్‌లో కూడా ఎక్కువగా మాట్లాడలేకపోయేవారట. అయినప్పటికీ, వారి ప్రేమ నిజమైనది. ఇదే కారణంగా వారు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లగలిగారు.
మొదట్లో వీళ్ల పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. నమ్రత - మహేష్ బాబు కంటే నాలుగేళ్ల పెద్దది. అలాగే ఆమె బాలీవుడ్ స్టార్. అందువల్ల, సూపర్ స్టార్ కృష్ణ పెళ్లి కి నో చెప్పారట. అయితే, మహేష్ బాబు సోదరి మంజుల వారి మధ్య బంధాన్ని సులభతరం చేసి, చివరకు 2005లో పెళ్లి జరిపించింది. వీళ్ల ప్రేమ సోషల్ మీడియాలో మరొకసారి ట్రెండ్ అయింది. నిజమైన ప్రేమకు కులం, మతం లేదా దూరం అడ్డంకి రాదు అంటూ మహేష్ బాబు-నమ్రత లవ్ స్టోరీ స్పష్టంగా చూపిస్తుంది.