
తాజాగా వరుణ్ తేజ్ గురించి సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతోంది. ఆయన ఇటీవలే తండ్రిగా మారారు. భార్య లావణ్య త్రిపాఠికి ఆరోగ్యవంతమైన బాబు పుట్టాడు. దాంతో వరుణ్ ప్రస్తుతం ఒకవైపు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌ని ఫుల్‌గా నెరవేర్చుతూనే, మరోవైపు కెరీర్‌పై కూడా సమానంగా దృష్టి సారిస్తున్నాడు. ఇదే సమయంలో ఆయన కొత్త సినిమా గురించి భారీ చర్చ నడుస్తోంది. వరుణ్ తేజ్ ప్రస్తుత్తం చేస్తున్న చిత్రం పేరు “కొరియన్ కనకరాజు” అని తెలుస్తోంది. ఈ టైటిల్ మాత్రమే వినగానే సోషల్ మీడియాలో హడావుడి మొదలైంది. చిత్రానికి సంబంధించి మేజర్ షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తయిందని, చివరి షెడ్యూల్ కోసం టీమ్ రెడీ అవుతోందని టాక్.
తాజాగా వరుణ్ తేజ్, విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపొందనున్న ఓ లవ్ స్టోరీకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఒక రియల్ లైఫ్ ఇన్స్పైర్డ్ కథ ఆధారంగా తెరకెక్కుతోందట. ఈ ప్రాజెక్ట్ పోయిన ఏడాదినే మొదలయ్యేది.. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయినప్పటికీ, ఇప్పుడు అన్ని విషయాలు క్లియర్ అయ్యాయని సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అన్ని అనుకూలిస్తే డిసెంబర్ నుంచే షూటింగ్ ప్రారంభం కానుంది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగగా, తర్వాతి ప్రధాన షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేశారు. పెద్ద బడ్జెట్, గ్లోబల్ స్కేల్‌లో ఈ సినిమా రూపొందబోతుందని మేకర్స్ చెబుతున్నారు.వరుణ్ తేజ్ ఈసారి సీరియస్‌గా మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడట. ఆల్ రెడీ కమిట్ అయిన “కొరియన్ కనకరాజు”తో తన కెరీర్‌లో మళ్లీ బిగ్ హిట్ కొట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు అభిమానులంతా ఒకే మాట అంటున్నారు —“ఈసారి వరుణ్ తేజ్ మెగా రేంజ్ హిట్ ఖాయం!”. చూడాలి మరి… ఈ “కొరియన్ కనకరాజు”తో అలాగే విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కే మూవీతో వరుణ్ తేజ్ నిజంగా రేంజ్ మార్చగలడా?