ఆమె ఓ స్టార్ హీరోయిన్.. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది.కానీ ఆ బంధం చివరి వరకు నిలవలేదు. జాతకాలు ఆమె వైవహిక జీవితంలో చిచ్చు పెట్టేసాయి. చివరికి విడాకులు తీసుకుంది. మరి ఇంతకీ ఆ నటి ఎవరయ్యా అంటే సీనియర్ నటి నళిని.. ఒకప్పుడు తన అంద చందాలతో సౌత్ ఇండస్ట్రీని ఏలిన నళిని ఇప్పుడు బామ్మ పాత్రల్లో నటిస్తోంది.ఇక నళిని అంటే ఇప్పటి జనరేషన్ వారికి తెలియకపోవచ్చు కానీ ఆమె ఫేస్ చూస్తే ఇట్టే గుర్తు పట్టేస్తారు.అయితే అలాంటి సీనియర్ నటి నళిని తన భర్తతో పెళ్లైన 13 ఏళ్లకు విడాకులు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక వీరి విడాకుల గురించి ఎన్నో రూమర్లు వినిపించినప్పటికీ రీసెంట్ గా నళిని ఓ ఇంటర్వ్యూలో విడాకులకు కారణం చెప్పడంతో మళ్ళీ వీరి విడాకులకు కారణం వైరల్ గా మారింది. ఇక భర్తతో విడాకుల కారణం ఏంటో రీసెంట్ ఇంటర్వ్యూలో నళిని చెప్పింది.. 

నేను రామరాజన్ ఇద్దరం  ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. కానీ మా మధ్య జాతకం చిచ్చు పెట్టేసింది. 13 ఏళ్లు కలిసే ఉన్న మేము విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పింది. అయితే నళిని భర్త రామ రాజన్ కి జాతకాల పిచ్చి ఎక్కువగా ఉండేదట.ఆయన ఏదైనా సరే జాతకాన్ని చూసుకునే అడుగులు ముందుకు వేస్తారట. అంతేకాదు పెళ్లయిన తర్వాత కొద్ది సంవత్సరాలకి మనం మరో నాలుగు సంవత్సరాలకు విడాకులు తీసుకుంటాం జాతకాల ప్రకారం అదే ఉంది అని ప్రతిసారి చెప్పేవాడట. కానీ ఎలాగో అలా 13 ఏళ్లపాటు ఆ బంధాన్ని కాపాడుకుంటూ వచ్చారట. కానీ చివరికి విడాకులు తీసుకున్నారు. అంతేకాదు ఓ సందర్భంలో రామరాజన్ నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా చెప్పారు.

 నళినిని పెళ్లి చేసుకుంటే పెళ్ళికి ఎంజీఆర్ గారు వస్తారు అందుకోసమే పెళ్లి చేసుకున్నాను అని చెప్పడం నళిని మనసుని గాయపరచిందట. అలా జ్యోతిష్యాన్ని బాగే నమ్మే రామరాజన్ చివరికి నళినికి విడాకులు ఇచ్చారు.ఇక విడాకుల తర్వాత ఈ ఇద్దరు ఎక్కడా కూడా ఒకరిని ఒకరు నిందించుకోలేదు. పరస్పరం గౌరవించుకుంటూనే ఉంటారు. అలాంటి ఈ జంట 2000 సంవత్సరంలో విడాకులు తీసుకుంది. ఇక విడాకులు జరిగిన 25 ఏళ్లకు మరోసారి ఈ విషయం వైరల్ అవుతుంది.. ఇక నళిని రామరాజన్ ని ప్రేమించినప్పటికీ నళిని ని హీరో అర్జున్ సార్జా ఇష్టపడ్డారు.ఆయన పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.కానీ నళిని మనసులో రామరాజన్ ఉన్నారని తెలిసి ఆయన వెనక్కి తగ్గారు.

మరింత సమాచారం తెలుసుకోండి: