ఈ ఆదివారం అనగా అక్టోబర్ 19 వ తేదీ నుండి భారత్ మరియు ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య మూడు వన్డేల మ్యాచ్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఈ సిరీస్ ఆస్ట్రేలియా లో జరగనుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియా కు చేరుకుంది. ఈ వన్డే టోర్నీ కి శుభ్ మాన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. ఇక మీచల్ మార్ష్ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. మరి ఇండియా , ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకు ఎన్ని మ్యాచ్లు జరిగాయి. ఎలాంటి ఫలితాలు వచ్చాయి. మరి ఇద్దరి బలా బలాలు ఏమిటి ..? ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ల ప్రకారం చూసుకుంటే ఎవరు పై స్థాయిలో ఉన్నారు అనేది తెలుసుకుందాం.

భారత్ మరియు ఆస్ట్రేలియా జట్లు ఇప్పటివరకు 152 వన్డే మ్యాచ్లలో తలపడ్డాయి. ఇందులో 84 మ్యాచుల్లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించగా ... భారత జట్టు 58 మ్యాచుల్లో గెలుపొందింది. ఇక ఆస్ట్రేలియా లో భారత మరియు ఆస్ట్రేలియా మధ్య మొత్తం 54 మ్యాచులు జరిగాయి. ఇందులో 38 మ్యాచ్ లలో ఆస్ట్రేలియా గెలుపొందగా , భారత్ కేవలం 14 మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించింది. రెండు మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. ఇలా ఇప్పటివరకు వన్డే మ్యాచ్ ల విషయంలో భారత్ , ఆస్ట్రేలియా మధ్య లెక్కలు చూసినట్లయితే ఆస్ట్రేలియా చాలా పై స్థాయిలో ఉంది. మరి ఈ సారి జరగబోయే వన్డే సిరీస్ లో భారత్ జట్టు ఆస్ట్రేలియా కు ఏమైనా షాక్ ఇస్తుందా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఏదేమైనా కూడా ఈ ఆదివారం నుండి స్టార్ట్ కాబోయే ఇండియా , ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసం ఎంతో మంది భారత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: