
ఇక అందులో ఒకరు ఈ మూవీలో ఉన్న లూడో డైలాగ్ ఉందా ? సెన్సార్ వాళ్లు కట్ చేశారా అని ప్రశ్నించడం జరిగింది. దీంతో కిరణ్ అబ్బవరం స్పందిస్తూ సమాధానం ఇచ్చారు . " ఈ డైలాగు లేదు మేమే దాన్ని వద్దనుకున్నాం . మీరేమో కుటుంబ సఫారీవార సమేతంగా సినిమా చూడమని కోరుకుంటున్న " అంటూ కిరణ్ అభవరం వెల్లడించాడు . సినిమాలోనేమో లూడో లాంటి డబల్ మీనింగ్ డైలాగ్స్ ఎన్నో ఉన్నాయి . కొన్ని డైరెక్ట్ బూతులు లాగా అనిపిస్తున్నాయి . అటువంటి సినిమాకు ఫ్యామిలీతో కలిసి చూడమని ఎలా ప్రమోట్ చేస్తున్నారు ... అంటూ కిరణ్ అభవరాన్ని ప్రశ్నించడం జరిగింది .
దీనికి ఈ హీరో .. సదరు క్యారెక్టర్ చిల్లరగా ప్రవర్తిస్తుంది కాబట్టి అతని పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్టర్ రాస్తున్న డైలాగ్ అది .. అని తెలియజేశారు . ఇక ప్రజెంట్ ఈ డైలాగ్ ఎందుకు తీసేసారు అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా .. అంటే అది బూతు లాగా అనిపిస్తుంది అని మీకే అనిపించి తీసేశారు కాబట్టి మీకు ఎథిక్స్ లేవా అంటూ ఆయన్ని ప్రశ్నించడం జరిగింది . ఎథిక్స్ ఉంటే ముందే అలాంటి డైలాగ్స్ ఉన్న కంటెంట్ నేను చెయ్యను అని చెప్పేవారు కదా మీరు అని ప్రశ్నించ గా.. కిరణ్ అబ్బవరం .. దీనికి నా వద్ద సమాధానం లేదు . మీరు నన్ను ఏదో ఎరకాటంలో పెట్టాలని అడుగుతున్నట్లు అనిపిస్తుంది నాకు .. అంటూ సైడ్ అయ్యాడు . ప్రజెంట్ ఇదే కన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .