క్రికెట్ ప్రియులు అత్యంత ఇష్టపడే ఆటల్లో టి20 ప్రపంచ కప్ ఉంటుంది. ఈ గేమ్ లో  ప్రపంచంలోని అన్ని దేశాల ఆటగాళ్లు పాల్గొంటారు. అయితే ఈసారి టీ20 వరల్డ్ కప్ 2026కు సంబంధించి భారత్, శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. నిజానికి ఇండియాలోనే పూర్తిగా టి20 వరల్డ్ కప్ జరిగేది. కానీ యుద్ధాల వల్ల ఇండియాను కాదని చెప్పి శ్రీలంకలో ఆతిథ్యం ఇస్తున్నారు. అయితే ఈ మెగా టోర్నీలో మొత్తం 20జట్లు పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ టోర్నీలో తాజాగా చివరి బెర్తులను యూఏఈ దక్కించుకుంది. ఇందులో ఈస్ట్ ఏసియా పసిఫిక్ క్వాలిఫైయర్స్ లో జపాన్ పై విజయాన్ని సాధించి యూఏఈ  బెర్త్ ను సొంతం చేసుకుంది. 

ఇక ఇదే కాకుండా  రీజియనల్ క్వాలిఫైయర్స్ ద్వారా నేపాల్, ఒమాన్ దేశాలు కూడా బెర్తులు ఖరారు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇందులో  భారత్ మరియు శ్రీలంక జట్లు ఆతిథ్యం ఇస్తున్నాయి కాబట్టి నేరుగా అర్హత సాధించాయి. టి20 వరల్డ్ కప్ లో సూపర్ 8 దశకు చేరినటువంటి ఏడు జట్ల విషయానికి వస్తే యూఎస్ఏ, వెస్టిండీస్,  ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు సైతం నేరుగా అర్హతను పొందాయి. అంతేకాకుండా ఐసీసీ ర్యాంకింగ్ ఆధారంగా పాకిస్తాన్, ఐర్లాండ్, న్యూజిలాండ్ ప్రపంచ కప్ బెర్తులను  సాధించాయి. ఇక అమెరికన్ రీజియనల్ క్వాలిఫైయర్స్ ద్వారా నెదర్లాండ్, ఇటలీ ,ఆఫ్రికా క్వాలిఫైయర్స్ ద్వారా  నమీబియా, జింబాబ్వేలు, ఈస్ట్ ఏసియా పసిఫిక్ క్వాలిఫైయర్స్ ద్వారా యూఏఈ, నేపాల్,ఒమన్ జట్లు కూడా బెర్తులను కన్ఫామ్ చేసుకున్నాయి.

ఇక 2026 లో జరగబోయే టి20 వరల్డ్ కప్ లో 20 జట్లు పాల్గొనగా.. ఆ 20 జట్లలో నాలుగు గ్రూపులు ఐదు టీమ్స్ చొప్పున డివైడ్ చేస్తారట.అలా విభజించిన ప్రతి గ్రూపు నుండి టాప్ -2 లో నిల్చిన టీమ్స్ సూపర్ -8కి చేరుకుటాయని తెలుస్తోంది. ఇక ఈ సూపర్-8లో లో కూడా నాలుగు జట్ల చొప్పున రెండు టీమ్స్ గా డివైడ్ చేస్తారు. ఇలా డివైడ్ చేసిన గ్రూపుల్లో టాప్ -2లో నిలిచిన టీమ్స్ సెమీ ఫైనల్ కి చేరతాయి. అలా సెమీఫైనల్ లో గెలిచిన రెండు జట్లు చివరికి ఫైనల్స్ కి వెళ్తాయి. అలా ఫైనాన్స్ లో రెండు జట్లు కప్పు కోసం తలపడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: