మరి కొన్ని రోజుల్లోనే బీహార్ రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ రాష్ట్రం లో మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలు రెండు విడకలుగా జరగనున్నాయి. ఇకపోతే బీహార్ రాష్ట్రం లో ఎన్నికలు జరగడానికి ముందు ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాక ముందు ఉన్న సమీకరణాలతో పోలిస్తే ఇప్పుడు సమీకరణాలు వేగవంతంగా మారుతూ వస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ ప్రధానంగా రెండు కూటముల మధ్య పోటీ కనబడుతోంది. అసలు ఏ మాత్రం ఓట్లు చిలకుండా ప్రధాన పార్టీలు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

బీహార్ లో ఎవరు గెలుస్తారు అనే దానిపై కూడా అనేక సర్వేలు ఇప్పటికే తమ సర్వే రిపోర్ట్ లను కూడా విడుదల చేశాయి. ఆ సర్వే రిపోర్ట్ ల ప్రకారం కూడా ఒక సర్వే లో ఒకరు గెలిచే అవకాశాలు కనిపిస్తే మరొక సర్వే లో మరొకరు గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. దానితో సర్వేల ప్రకారం ఒక పార్టీ లీడ్ లోకి వస్తుంది అని కూడా చెప్పే అవకాశాలు ప్రస్తుతం కనబడడం లేదు. ఏదేమైనా కూడా ప్రస్తుతం అధికారం లో ఉన్న పార్టీ కొన్ని రోజుల క్రితమే అక్కడ మహిళలకు 10,000 రూపాయలను ఇచ్చింది.

దాని ఎఫెక్ట్ ఏమైనా ఎలెక్షన్లలో ఉంటుందా ..? దాని ద్వారా ఆ పార్టీ కి మంచి జరుగుతుందా అనే సమీకరణాలు ఒక వైపు వినబడుతూ ఉంటే , ప్రభుత్వం పై వ్యతిరేకం ఏర్పడి దాని కారణంగా ప్రతి పక్ష పార్టీకి మంచి జరిగే అవకాశాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అని కొంత మంది ఒక వాదనను వినిపిస్తున్నారు. ఏదేమైనా కూడా బీహార్ ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారు ..? అనే దానిపై రోజుకో సమీకరణాలు ముందుకు వస్తున్నాయి. మరి బీహార్ రాష్ట్రం లో ఎవరు గెలుస్తారు అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేసి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bn