ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్న దేశాలలో అమెరికా ఒకటి. అమెరికా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాలతో పోల్చినట్లయితే అద్భుతమైన స్థాయిలో ఉంది. ఇలా అమెరికా అద్భుతమైన స్థాయిలో ఉంది కాబట్టి ఆ దేశానికి ఆర్థిక సంక్షోభం అస్సలు రాదు అని , వారు ఎప్పుడూ ఆర్థికంగా ఎంతో బలంగా ఉంటారు అని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. కానీ అమెరికా ఎంతో సంపన్న దేశం అయినప్పటికీ ఆదేశానికి కూడా అనేక సందర్భాలలో ఆర్థిక సంక్షోభాలు ఏర్పడ్డాయి.

కాకపోతే ఆర్థికంగా చాలా బలమైన దేశం కావడంతో ఆ ఆర్థిక సంక్షోభాల నుండి చాలా త్వరగా ఆ దేశం బయట పడిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అమెరికా మరోసారి భారీ ఆర్థిక సంక్షోభానికి లోనయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. కొన్ని విషయాలలో ఇప్పటికే అమెరికా చాలా పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టానికి గురైనట్లు , దాని ప్రభావం వల్ల అమెరికా మరోసారి పెద్ద ఎత్తున చారిత్రక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే అమెరికాలో ప్రధాని ఎన్నికలు జరగగా ఆ ఎన్నికలలో ట్రంప్ అద్భుతమైన స్థాయిలో గెలుపొంది ప్రస్తుతం అమెరికా దేశానికి ప్రధాన మంత్రి గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.

ట్రంప్ అధికారం లోకి వచ్చాక అనేక దేశాలపై పెద్ద ఎత్తున టారిఫ్ లను విధిస్తూ వస్తున్నాడు. మరి ముఖ్యంగా భారత్ , చైనా పై ట్రంప్ టారిఫ్ లను పెద్ద ఎత్తున విధించాడు. అమెరికన్లు ఎక్కువ శాతం భారత్ , చైనా వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆ రెండు దేశాల వస్తువుల  పైన ఎక్కువ శాతం టారిఫ్ లను విధించడంతో ఈ రెండు దేశాల వస్తువులు అమెరికాలకు భారీ ధరకు దక్కుతున్నాయి. దీనితో ట్రంప్ పై కూడా అక్కడ ప్రజలు వ్యతిరేకత చూపుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: