కర్నూలు బెంగళూరు రహదారిలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ ప్రమాదానికి గురి కావడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఏపీ హోం మంత్రి అనిత మాట్లాడుతూ ఈ ఘటనలో 19 మంది మృతి చెందారని అన్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని ఆమె కామెంట్లు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆమె అన్నారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఆమె కామెంట్లు చేశారు. డ్రైవర్ ఇచ్చిన ప్రాథమిక సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
ప్రమాదంలో మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా కాలిపోయాయని అనిత వెల్లడించారు. చనిపోయిన వ్యక్తుల డీ.ఎన్.ఏ ఆధారంగా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేస్తామని మంత్రి తెలిపారు. డీ.ఎన్.ఏ పరీక్షల కోసం 10 ప్రత్యేక బృందాలు పని చేస్తాయని ఆమె అన్నారు. ప్రమాదానికి కారణాలు అన్వేషించడానికి మరో 4 బృందాలు, కెమికల్స్ విశ్లేషణ కోసం 2 బృందాలు పని చేస్తాయని తెలిపారు.
మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం ప్రకటించారు. రోడ్డుపై పడి ఉన్న బైక్ ను ఢీ కొట్టినట్టు బస్సు డ్రైవర్ చెప్పాడని తెలుస్తోంది. బైక్ పై నుంచి బస్సు వెళ్లడంతో మంటలు చెలరేగాయని డ్రైవర్ చెప్పాడని సమాచారం అందుతోంది. ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతోందని కర్నూలు ఎస్పీ తెలిపారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి