ఈ మధ్య కాలంలో సైబర్  మోసాలు ఊహించని స్థాయిలో జరుగుతున్నాయి.  తాజాగా కేరళకు చెందిన కొంతమంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.  కంబాలక్కడ్ పట్టణానికి చెందిన 500 మంది బ్యాంక్ అకౌంట్లను అద్దెకు ఇచ్చి కేసుల్లో చిక్కుకున్నారు.  సైబర్ నేరస్థులు వీళ్ళ బ్యాంక్  అకౌంట్లను  అద్దెకు తీసుకున్నారు.  తాము కొల్లగొట్టిన సొమ్మును ఆ అకౌంట్లలోకి బదిలీ చేయించుకున్నారు.

వీళ్ళు మనీ మ్యూల్స్  కావడంతో పోలీసులు వీరిపై  నమోదు చేయడం గమనార్హం,  దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి.  చైనా సూత్రధారులు ఈ పనులు చేస్తున్నారని  తెలుస్తోంది.  ప్రకటనలు  ఇచ్చి వీళ్ళు బ్యాంక్ ఖాతాలను అద్దెకు తీసుకుంటున్నారు. తాము చెప్పిన పని చేస్తే లక్షల్లో కమిషన్లు ఇస్తామని ఆశ చూపి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు.

ప్రధానంగా డొల్ల కంపెనీల పేర్లతో కరెంట్ అకౌంట్లను ఓపెన్ చేసి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు.  2025  సంవత్సరంలో గుర్తించిన మ్యూల్  ఖాతాలు 8.5 లక్షలుగా ఉన్నాయి. ఈ బ్యాంక్  లావాదేవీలు ఏకంగా 743 శాఖలలో జరిగాయని తెలుస్తోంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్  అనుమానిత మ్యూల్  ఖాతాలను స్తంభింపజేసింది.  సైబర్ నేరస్తులు కొట్టేసిన డబ్బులో దాదాపుగా 70 శాతం  ఈ  మ్యూల్  ఖాతాల ద్వారానే  బదిలీ అవుతుండటం కొసమెరుపు.

కొన్నిరోజుల క్రితం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ మోసం వెలుగులోకి వచ్చింది. 74  సంవత్సరాల వయస్సు ఉన్న వృద్ధుడి నుంచి  58 కోట్ల రూపాయలను బదిలీ చేయడానికి ఏకంగా 6500 మ్యూల్  ఖాతాలను  ఉపయోగించారని తెలుస్తోంది. కమిషన్ కు ఆశపడి బ్యాంక్ అకౌంట్లను ఇస్తే మాత్రం  తర్వాత కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.   సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్తరకం మోసంతో  ప్రజలను దోచుకుంటున్నారు. ఈ తరహా మోసాల బారిన మీరు పడకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: