ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.  బుధవారం నుంచి పత్తి  కొనుగోలు  కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. పత్తి కనీస మద్దతు ధర రూ.8,100 అన్న సంగతి తెలిసిందే.  కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ  పత్తిని కొనుగోలు చేయనున్నారు.

వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు నుంచి ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.   మొంథా తుపాను తీవ్రత నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు తక్షణమే పత్తి  సేకరణ చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.  ఈ ఏడాది దాదాపుగా  నాలుగున్నర లక్షల హెక్టార్లలో పత్తి  సాగైంది. పత్తి  రైతులు కొనుగోలు ప్రక్రియను సక్రమంగా పాటించాలని అచ్చెన్నాయుడు సూచనలు చేశారు.

రైతులు మొదట రైతు సేవా కేంద్రాల ద్వారా తమ వివరాలను సీఎం యాప్‌లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్  ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.  ఆ తర్వాత కపాస్  కిసాన్ యాప్ లో  నమోదు చేసుకోవాలి.   సీసీఐ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తిని అమ్ముకోవాల్సి ఉంటుంది. వీఏఏలు రైతులకు ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం ఇవ్వాలని  అచ్చెన్నాయుడు సూచనలు చేశారు.

 పత్తి కొనుగోలును విజయవంతంగా పూర్తి చేయాలని  ఆయన కోరారు.  పత్తికి మద్దతు ధర పెంచితే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం క్వింటాల్ 10,000 రూపాయలు ఉంటే  తప్ప గిట్టుబాటు కాదని రైతులు అభిప్రాయపడుతున్నారు. రైతులకు నగదు వేగంగా జమ చేయాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: