కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది. వారి జీతాలు, పెన్షన్లు పెంచడానికి వీలుగా 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ కీలక నిర్ణయంతో ఉద్యోగులు, పెన్షన్ దారులలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

జస్టిస్ రంజనా ప్రసాద్ దేశాయ్ నేతృత్వంలో ఈ వేతన సంఘం పనిచేయనుంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ అయిన జస్టిస్ రంజనా ప్రసాద్ దేశాయ్ ఈ కమిషన్కు చైర్ పర్సన్గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో ఆమెతో పాటు మరో ఇద్దరు సభ్యులు కూడా ఉంటారని తెలుస్తోంది.

ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘం కాలపరిమితి 2026 సంవత్సరంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో, కొత్త వేతన సవరణలను అమలు చేయడానికి వీలుగా 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర మంత్రులు, మంత్రిత్వ శాఖలు, అధికారులతో విస్తృత చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి నెలలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడటం విశేషం.

ఈ వేతన సంఘం తన నివేదికను 18 నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారుల జీతాలు, పెన్షన్లలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. వేతన సవరణల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇది నిజంగా పెద్ద ఉపశమనం. కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై  నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: