త్వరలోనే బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో అక్కడి ఓటర్లను సైతం ఆకర్షించేందుకు nda ఉమ్మడి మ్యానిఫెస్టో రిలీజ్ చేసింది. ఈ మ్యానిఫెస్టో కూటమిలో ఉన్న సీనియర్ నాయకుల సమక్షంలో విడుదల చేశారు. బీహార్ ఆర్థిక మంత్రి అయిన సామ్రాట్ చౌదరి ఈ మ్యానిఫెస్టో గురించి మీడియాతో మాట్లాడుతూ వివరించారు.. రాబోయే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు ఇస్తామని కోటి మంది మహిళలను లక్ష అధికారులను చేస్తామంటూ తెలియజేశారు. ప్రతి జిల్లాలో కూడా మెగా లెర్నింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామంటూ తెలియజేశారు.


బీహార్ ను ప్రపంచ అభ్యస కేంద్రంగా మార్చేస్తామంటూ తెలియజేశారు. ఈ సమావేశంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అయిన ప్రకాష్ నడ్డా, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో పాటు బీహార్ బిజెపి ఎన్నికల ఇన్చార్జి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రి జీతన్ రామ్ మరి కొంతమంది నేతలు పాల్గొన్నారు. అలాగే బీహార్లో 50 వేలకు పైగా కుటీర సంస్థల ప్రణాళికలకు రంగం సిద్ధం చేస్తామని తెలియజేశారు.


ఎన్డీఏ మ్యానిఫెస్టోలో మహిళల కోసం ప్రత్యేకించి హామీలను ఇచ్చారు. ఉపాధి పథకం కింద మహిళలకు గరిష్టంగా రూ .2లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు.


ఇక రైతుల కోసం కిసాన్ సన్మాన నిధి కింద రూ .6000 నుంచి రూ .9,000 కు పెంచాలని, మత్స్యకారులకు సబ్సిడీ కింద రూ .4500 నుంచి రూ .9000 రూపాయలకు పెంచాలని నిర్ణయించామంటూ తెలిపారు.


వెనుకబడిన వర్గాలకు ఎస్టీ విద్యార్థులకు ప్రత్యేకించి  మ్యానిఫెస్టోలో తీసుకువచ్చారు. ప్రతి సబ్ డివిజన్లో ఎస్సీ విద్యార్థుల కోసం ప్రత్యేకించి రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తామని. అలాగే ఎస్సీ విద్యార్థులకు నెలకు  రూ.2000 రూపాయలు చొప్పున స్కాలర్షిప్ ఇస్తామంటూ తెలిపారు. అలాగే ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని తెలిపారు.


50 లక్షల కొత్త ఇల్లు నిర్మిస్తామని, పేదలకు ఉచితంగా రేషన్ ,ప్రతి కుటుంబానికి 125 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందిస్తామంటూ తెలిపారు.

బీహార్లో  నాలుగు కొత్త నగరాలలో మెట్రో ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నట్లు ఎన్డీఏ హామీ ఇచ్చింది. పర్యటన పరంగా కూడా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామంటే తెలియజేశారు. అలాగే ఎక్స్ప్రెస్ రైల్వే ట్రాక్ 3,600 కిలోమీటర్ల వరకు అధునాతన ప్రణాళికాలు రూపొందించబోతామని హామీ ఇచ్చారు.


గడచిన కొద్ది రోజుల క్రితం RJD కాంగ్రెస్ నేతృత్వంలో మహాఘట్ బంధన్ బీహార్ కా తేజస్వి ప్రాన్ అనే పేరుతో మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో రాష్ట్రంలో ఉండే ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామనే విషయమే హైలెట్గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: