ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం నారా లోకేశ్ పేరు మారుమ్రోగుతోంది. నారా లోకేశ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకొని కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో దర్బార్ లను నిర్వహించని ఎమ్మెల్యేలపై నారా లోకేష్ ఫైర్ అయినట్టు సమాచారం అందుతోంది. నాలుగు గంటల పాటు కార్యకర్తల కోసం అందుబాటులో ఉండి లోకేశ్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు.
అయితే నారా లోకేశ్ కార్యకర్తల మంచి కోసమే కృషి చేస్తున్నా మీడియా అత్యత్యాహం వల్ల నారా లోకేశ్ కు మంచి పేరు కంటే చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. నాలుగు గంటల్లో నారా లోకేష్ ఏకంగా 4000 సమస్యలు విన్నారని మీడియా ప్రచారం చేసింది. అయితే నాలుగు గంటల్లో నాలుగు వేల సమస్యలను వినడం సాధ్యమేనా అనే ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
నారా లోకేష్ కు 4000 వినతి పత్రాలు అంది ఉండవచ్చని కానీ మీడియా మాత్రం మరోలా ప్రచారం చేసిందని తెలుస్తోంది. నారా లోకేష్ సైతం ఈ తరహా ప్రచారం విషయంలో ఒకింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నారా లోకేశ్ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ మరింత మంచి పేరును తెచ్చుకోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.
నారా లోకేశ్ సైతం ఈ తరహా విషయాలను గమనించి ఇలాంటి ప్రచారానికి దూరంగా ఉంటే మంచిది. రాజకీయాల్లో మరీ ఓవర్ హైప్ మంచిది కాదు. డిజిటల్ యుగంలో ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేని స్థితిలో ప్రజలు లేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి