ఫలితంగా, “ఒక్కసారి ప్రధానమంత్రి” అనే ముద్ర ఆయన పేరుతో చెక్కుకుపోయింది. ఇప్పుడు ఆ చరిత్రనే జగన్ మోహన్ రెడ్డి పునరావృతం చేస్తున్నారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు నుంచి ఇప్పటివరకు ఆయన ప్రవర్తన, ప్రజలతో దూరంగా ఉండే తీరు ఆయనకు పెద్ద మైనస్‌గా మారింది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు రాష్ట్రం ఎన్నో విపత్తులు ఎదుర్కొన్నా - ఆయన కేవలం “బటన్ నొక్కే సీఎం”గా మాత్రమే ప్రజల మదిలో నిలిచిపోయారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం సమయంలో ఒక్కసారే బాధితులను స్వయంగా కలిసిన ఆయన, తరువాత ఏ పెద్ద సంఘటనకీ నేరుగా వెళ్లలేదు. కరోనా సమయంలోనూ, ఏలూరు వ్యాధి ప్రభావ సమయంలోనూ, వరదల సమయంలోనూ జగన్ తాడేపల్లి నివాసం దాటి రాలేదు.
బాధితులను పరామర్శించకపోవడమే కాకుండా, పార్టీ లోపల జరిగే గందరగోళాలపై కూడా ఆయన స్పందన లేకుండా పోయింది. అధికారం ఉన్నంతకాలం ఆయనకు భిన్నాభిప్రాయాల పట్ల సహనం లేకపోవడం, నాయకులను కఠినంగా నియంత్రించకపోవడం పార్టీకి నష్టాన్ని తెచ్చింది. ఇప్పుడీ పరిణామాలన్నీ చూస్తే, ప్రజలతో దూరంగా ఉన్న నాయకుడికి రాజకీయ భవిష్యత్తు ఎంత ప్రమాదంలో ఉంటుందో జగన్ కూడా తెలుసుకుంటున్న సమయం వచ్చింది. దేవెగౌడ గారి నిర్లక్ష్యం ఆయనను చరిత్రలో “ఒక్కసారి ప్రధాని”గా నిలిపితే, జగన్ నిర్లక్ష్యం ఆయనను “ఒక్కసారి సీఎం”గానే పరిమితం చేస్తుందేమో అన్న చర్చ బలంగా వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల మమకారం కోల్పోతే - తిరిగి ఆ మమకారం పొందడం కష్టం. ఇదే దేవెగౌడ పాఠం… ఇప్పుడు అదే పాఠం జగన్ చదవాల్సిన సమయం!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి