జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చావో రేవో అనే విధంగా ప్రచారం చేస్తున్న తరుణంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు సంబంధించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ విషయాన్ని బయటకు తీసుకువచ్చి సెంటిమెంట్ క్రియేట్ చేసి అక్కడ గెలవాలని అనేక ప్రయత్నాలు చేస్తోంది. మాగంటి సునీత తన పిల్లలు కూడా పూర్తి ప్రచారం చేస్తూ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ వారి కుటుంబానికి సంబంధించిన అనేక విషయాలను ప్రజలకు వివరిస్తూ సెంటిమెంటు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా బీఆర్ఎస్ మంచి ఊపు మీద ఉన్న సమయంలో తాజాగా మాగంటి గోపీనాథ్ తల్లి సంచలన వ్యాఖ్యలు చేసింది. గోపీనాథ్ మొదటి భార్య మాలినీ దేవి అంటూ చెప్పుకొచ్చింది. 

అంతేకాదు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడంపై గోపీనాథ్ మొదటి భార్య అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది. ఇదే అంశంపై శేర్లింగంపల్లి తహశీల్దార్ విచారణ కూడా చేపట్టారు. ఈ సందర్భంగానే మాగంటి గోపీనాథ్ భార్య సునీత కాదంటూ, గోపీనాథ్ వారసుడు మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్న అంటూ ఫిర్యాదు కూడా చేశారు. అలాగే నా మనవడికి న్యాయం చేయాలని మాగంటి తల్లి మహానందకుమారి అన్నారు. నేనే గోపినాథ్ కు మాలిని దేవికి పెళ్లి చేశానని, దీనికి సంబంధించి అనేక సాక్ష్యాలు ఉన్నాయని,తన కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నా కానీ తనను  సునీత అస్సలు చూడనివ్వలేదని ఆరోపించింది.

ఇక కేటీఆర్ కు ఈ విషయం చెప్పినా ఆయన పట్టించుకోలేదని, తన కుమారుడు గోపీనాథ్ మరణం కూడా ఒక మిస్టరీ అని అనుమానం వ్యక్తం చేసింది.. అనంతరం మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీ దేవి మాట్లాడుతూ.. నేను లీగల్ గా వెళ్తానని, గోపీనాథ్ అసలు వారసుడు నా కొడుకు ప్రద్యుమ్న అంటూ చెప్పుకొచ్చింది. నా దగ్గర వందలాది ప్రూఫ్స్ ఉన్నాయని, కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా ఉందని తెలియజేసింది. అసలు సునీతకు కుటుంబ సభ్యుల సపోర్టు లేదని ఆమె ఒక్కతే  ఇలా ప్రవర్తిస్తోందని తెలియజేసింది. మరి చూడాలి ఈ వివాదం సునీతకు ఏమైనా మైనస్ చేస్తుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: