మోమిన్ పెట్ సమీపంలో నివసించే ఒక మైనర్ బాలికపైన వాహిద్ అనే ఆటోడ్రైవర్ అత్యాచారం పాల్పడ్డాడు అంటూ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో వెళ్లి ఫిర్యాదు చేయగా అతని చర్యలు ఒక సైకోల ఉన్నాయంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో భాగంగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయట. నిందితుడు వాహీద్ గతంలో కూడా సుమారుగా 10 మంది అమ్మాయిల పైన అత్యాచారం చేసి, అదుపు సంబంధించిన వాటిని తన మొబైల్ లో చిత్రీకరించినట్లు తెలియజేశారు. ఇది అతడికి వికృత ఆనందాన్ని కలిగించేలా చేస్తుందని తెలియజేశారు.
ఆ మైనర్ బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మోమిన్ పెట్ పోలీసులు కేసు నమోదు చేసి నిండితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ నిందితుడు దగ్గర ఉంటే సెల్ ఫోన్ కీలకమైన సాక్ష్యంగా ఉన్నది.నిందితుడు ఆటో డ్రైవర్ కు నరసింహులు అని మరొక వ్యక్తి కూడా సహకరించినట్లు అధికారులు బయటపెట్టారు. ఈ ఘటన దేవరాపల్లి అడవిలో జరిగినట్టుగా గుర్తించారు. ఫోక్సో చట్టాలు వంటివి ఉన్నప్పటికీ బాలికల పైన ఇంకా ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ చట్టాల పైన ప్రభుత్వాలు మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రుల సైతం తెలియజేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులను పోలీసులు కఠినమైన శిక్షపడేలా చేయాలని తెలియజేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి