తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా బిజీగా ఉన్న జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన మల్టీ టాలెంట్స్‌ని ప్రదర్శించారు. సినిమా, రాజకీయాల తర్వాత ఇప్పుడు ఆయన ఫైరింగ్ రేంజ్‌లో కూడా తన ప్రతిభను చాటుతూ అభిమానులను ఆశ్చర్యపరిచారు.తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి ప్రాంతంలో ఉన్న ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ ఫైరింగ్ రేంజ్‌ను పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో సమగ్రంగా చర్చించి, తుపాకీ నిర్వాహణ, సేఫ్టీ ప్రోటోకాల్‌లు, షూటింగ్ పద్ధతులపై వివరాలను తెలుసుకున్నారు. ఆ తరువాత స్వయంగా ఫైరింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొని తన నైపుణ్యాన్ని చూపించారు.


పవన్ కళ్యాణ్ గ్లోక్ 0.45 మిల్లీమీటర్ పిస్టల్‌తో 30 రౌండ్లు వరకు ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ప్రతీ షాట్ టార్గెట్‌ని ఖచ్చితంగా హిట్ చేయడంతో అక్కడి అధికారులే కాదు, ఫైరింగ్ రేంజ్ సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు. “ఇదే పవన్ కళ్యాణ్ స్టైల్” అంటూ అందరూ ప్రశంసలు కురిపించారు.తన కాలేజ్ రోజుల్లోనే ఆయుధ వినియోగం, షూటింగ్ ప్రాక్టీస్‌పై ఆసక్తి ఉన్న పవన్ కళ్యాణ్, గతంలో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ సభ్యుడిగా, అలాగే మద్రాస్ రైఫిల్ క్లబ్ సభ్యుడిగా చెన్నైలో రైఫిల్ ఫైరింగ్‌లో శిక్షణ పొందిన విషయం తెలిసిందే. ఆ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన ఈ ప్రాక్టీస్‌లో పాల్గొనడం విశేషం.



పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ — “ఫైరింగ్ ఒక క్రీడ మాత్రమే కాదు, అది క్రమశిక్షణ, కేంద్రీకరణ, మరియు మానసిక స్థైర్యాన్ని పెంచే సాధన. ఇది శరీరానికీ, మనసుకీ బలాన్నిస్తుంది” అని పేర్కొన్నారు. ఆయన మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసం, ఆ ప్రాక్టీస్‌లో కనబరిచిన దృష్టి — నిజంగా ఆర్మీ స్థాయి కట్టుదిట్టతను గుర్తు చేశాయి.ఇదిలా ఉండగా, జనసేన మీడియా విభాగం ఈ ఫైరింగ్ సెషన్‌కు సంబంధించిన వీడియోను ఆదివారం విడుదల చేసింది. వీడియోలో పవన్ కళ్యాణ్ పూర్తి సేఫ్టీ గేర్ ధరించి, కచ్చితమైన ఫోకస్‌తో టార్గెట్‌లను హిట్ చేస్తూ కనిపిస్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, అభిమానులు “సినిమాల్లో పవర్ స్టార్, రాజకీయాల్లో పవర్ లీడర్, ఇప్పుడు ఫైరింగ్ రేంజ్‌లో పవర్ షాట్స్..!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.



పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా, ఫిట్‌నెస్, మానసిక శాంతి, క్రమశిక్షణకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే షూటింగ్, యోగా, మార్షల్ ఆర్ట్స్ వంటి శారీరక, మానసిక శిక్షణలను ఆయన తరచూ కొనసాగిస్తుంటారు. ఈ సారి ఫైరింగ్ ప్రాక్టీస్‌ కూడా అదే క్రమంలో భాగమని తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ ఈ చర్యతో మరొకసారి  ఆయన కేవలం రాజకీయ నాయకుడు కాదు, నిజమైన యోధుడు  తన సమయాన్ని, శక్తిని ఎల్లప్పుడూ దేశం కోసం, ప్రజల కోసం వినియోగించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి అని నిరూపించారు .మొత్తం మీద, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరోలా, రాజకీయాల్లో నాయకుడిలా, ఫైరింగ్ రేంజ్‌లో నిజమైన షూటర్‌లా మరోసారి “100% స్ట్రైక్ రేట్”తో అందరినీ ఆకట్టుకున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: