జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గత కొన్ని రోజుల నుండి తెలంగాణ రాష్ట్రం లో ఉన్న ప్రజల నోళ్లలో నానుతున్న పేరు.. ఇక్కడ గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు పని చేస్తున్నాయి.ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేలా మారిపోయింది. కానీ బీజేపీ మాత్రం లోక్సభ ఎన్నికల ఫలితం రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు హోరాహోరీగా ప్రచారం సాగించారు.ఇరు పార్టీల ప్రధాన నాయకులు జూబ్లీహిల్స్ లో తిష్ట వేసి గడపగడపకి ప్రచారం చేశారు. రోడ్ షోలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు ఇలా ఎన్నో జరిగాయి.ఇక ప్రచారం ముగియడంతో చివరి ప్రయత్నాలు చేసుకుంటున్నారు.. ఈ నేపథ్యంలోనే మూడు ప్రధాన పార్టీల నేతలు చివరి అవకాశంగా మరోసారి ప్రజలను ప్రసన్నం చేసుకునే దిశలో అడుగులు వేస్తున్నారు.

 ముఖ్యంగా పోలింగ్ కి మరికొద్ది గంటలే ఉండడంతో స్థానిక నాయకులకి దిశా నిర్దేశం చేసి ఓటర్లను తమ వైపు ఆకట్టుకునేలా చేస్తున్నారు. పోలింగ్ బూత్ కి వెళ్లే లోపైన ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే రేవంత్ రెడ్డి పోలింగ్ ముగిసే వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారట.అలాగే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీల నాయకులు కూడా స్థానిక కేడర్ కి దిశా నిర్దేశం చేస్తూ ప్రజల్లో ఉండి చివరి ప్రయత్నం చేయాలి అని చెబుతున్నారట.అంతేకాదు ఓటింగ్ ఈసారి భారీగా పెరగాలని కూడా నేతలు స్థానిక కేడర్ కి చెబుతున్నారట.

అలా స్థానిక కేడర్ సహాయంతో ఓటింగ్ పెరగాలని నాయకులు ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే మూడు పార్టీలు పలు సీక్రెట్ సర్వేలు చేయించుకొని ఎవరు గెలుస్తారు.. ఎక్కడ మెజారిటీ వస్తుంది అనేది తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏ పార్టీ గెలవబోతుంది అనేది సంచలనంగా మారింది.ఏది ఏమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనేది కాంగ్రెస్,బీఆర్ఎస్ కి జీవన్మరణ ఎన్నికగా మారిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ గెలిస్తే బీఆర్ఎస్ రాష్ట్రంలో మళ్లీ పుంజుకుంటుంది. లేకపోతే ఇక అంతే సంగతులు.ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే మాత్రం రాష్ట్రం మొత్తం వ్యతిరేకత వస్తుంది అని అర్థమవుతుంది. మరి చూడాలి జూబ్లీహిల్స్ ఓటర్ల మనసులో ఏముందో

మరింత సమాచారం తెలుసుకోండి: