దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర నిన్నటి రోజున సాయంత్రం 6:52 నిమిషాలకు ఒక భారీ పేలుడు అందరిని భయభ్రాంతులకు గురిచేసింది. అక్కడే ఉండే పలు కార్లు, ఆటోలు, బైకులు కూడా పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అయితే ఈ వాహనాలలో ఎవరెవరు ఉన్నారని విషయం ఇంకా అధికారులు తెలపడం లేదు. ఈ బాంబు పేలుడులో ఇప్పటివరకు 13 మందికి పైగా మరణించారు. 24 మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. తీవ్ర గాయాలైన వారందరినీ కూడా LNJP ఆస్పత్రికి తరలించారు.అయితే ఇందులో ముగ్గురు పరిస్థితి విషయంగానే ఉన్నట్లు వినిపిస్తోంది. ఈ పేలుడు దాటికి సుమారుగా 8 వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని అధికారులు తెలియజేస్తున్నారు.



రాబోయే కొన్ని గంటలలో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఈ ఘటన స్థలాన్ని NIA, NSG బృందాలు పరిశీలిస్తున్న ఢిల్లీలో కారు పేలుడు ఘటనతో ఒక్కొక్కసారిగా అన్ని ప్రాంతాలలో  హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా ప్రధాన నగరాలైన హైదరాబాద్ ,ముంబై వంటి ప్రాంతాలలో కూడా పోలీసులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసులతో ఉన్నత అధికారులతో మాట్లాడి అక్కడ పరిస్థితులను కూడా తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా దేశంలోనే భారీ ఉగ్ర కుట్రను సైతం భద్రతా బలగాలు భగ్నం చేసినప్పటికీ వారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున మందు గుండును కూడా స్వాధీనం చేసుకున్నారట.


కానీ అలా చేసిన కొన్ని గంటలకే ఈ భారీ పేలుడు ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి పట్టుకున్న ఆ ఉగ్రవాదుల కుట్రకు ఈ బాంబు బ్లాస్ట్ కి ఏవైనా సంబంధాలు ఉన్నాయా లేవా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారట. ఈ బాంబు పేలుడు ఘటన స్థలానికి 800 మీటర్ల దూరంలో ఉన్న దుకాణలు కూడా అదిరిపోయాయని అక్కడి వ్యాపారులు తెలియజేస్తున్నారు. అయితే ఈ కారులో ఉన్న పేలుడు పదార్థాన్ని ఎవరైనా రిమోట్ కంట్రోల్ తో పేల్చారా లేదా అనే అనుమానాలను కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కారు హుందాయి i -20 కారని తెలుపుతున్నారు. అయితే ఈ కారులో ముగ్గురు ఉన్నట్టుగా ప్రత్యక్షమైన సాక్షులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: