దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో నిన్నటి రోజున సాయంత్రం భారీ కారు బాంబు పేలుడు జరిగింది. ఇందులో సుమారుగా 13 మందికి పైగా మరణించినట్లుగా వినిపిస్తున్నాయి. అలాగే 24 మందికి పైగా గాయాలైనట్లుగా సమాచారం. ఈ పేలుడు సుమారుగా 14 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు జరిగినట్లుగా వినిపిస్తోంది. చివరిసారిగా 2008లో రాజధానిలో బాంబు బ్లాస్ట్ జరిగిందట. నాలుగు దశాబ్దాలుగా ఢిల్లీలో చాలాసార్లు ఇలాంటి బీభత్సవం జరిగింది. ఇక్కడ జరిగిన పేలుళ్ల వల్ల ప్రాణా నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా దేశ భద్రత వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.



ఢిల్లీలో మొదటిసారిగా జరిగిన ఒక పెద్ద బాంబు బ్లాస్ట్ 1985లో జరిగింది. మే 10వ తేదీన చాలా ప్రదేశాలలో ఒకేసారి బాంబు దాడులు జరిగాయి. ఢిల్లీలో జరిగినటువంటి ఈ పేలుడు కారణంగా 49 మంది మరణించగా, 127 మంది గాయాలయ్యాయి. స్వాతంత్రం వచ్చిన తరువాత ఢిల్లీలో జరిగినటువంటి ఉగ్రవాద సంఘటన.


ఆ తర్వాత 1996 మే 21న లజ్ పత్  ప్రాంతంలో ఉండేటువంటి సెంట్రల్ మార్కెట్లో భారీ పేలుడు జరిగింది. సుమారుగా 13 మంది మరణించగా 38 మందికి పైగా గాయాలయ్యాయి. ఇది కూడా కాశ్మీర్ ఉగ్రవాద కుట్ర భాగంతోనే జరిగిందట.


మళ్లీ 2005 అక్టోబర్ 29న దీపావళికి రెండు రోజులు ముందు చాలా ప్రదేశాలలో ఒకేసారి బాంబు బ్లాస్టులు జరిగాయి. అందులో పహార్గంజ్, సరోజినీ నగర్, గోవిందపురి. ఇందులో 62 మంది మరణించగా 210 మందికిపైగా గాయాలయ్యాయి.


మళ్లీ 2008 సెప్టెంబర్ 13న మరొకసారి ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ జరిగింది. ఒకేసారి 5 పేలుళ్లు సంభవించాయి. దాదాపుగా 30 మంది మరణించగా 100 మంది పైగా గాయపడ్డారు.


2008 సెప్టెంబర్ 27న మోహ్రౌలి పూల మార్కెట్లో టిఫిన్ బాక్సులో ఒక బాంబు బ్లాస్ట్  చేశారు. ఈ బ్లాస్టులో 3 వ్యక్తులు మరణించక 23 మంది గాయపడ్డారు.


ఆ తరువాత 2011 సెప్టెంబర్ 7న ఢిల్లీ హైకోర్టు కొంత దూరంలో పేలుడు సంబంధించిన. చాలామంది గాయపడ్డారు కానీ ఎటువంటి ప్రాణ నష్టం లేదట.


IDSA నివేదికల ప్రకారం 1997 నుంచి ఢిల్లీలో ఇప్పటివరకు 26 పెద్ద పేలుళ్లు  జరిగాయి. ఇందులో 92 మందికి పైగా మరణించగా 600 మందికి పైగా గాయపడ్డారట.

మరింత సమాచారం తెలుసుకోండి: