ఢిల్లీలో నిన్నటి రోజు జరిగిన కారు పేలుడు దేశాన్ని మొత్తం వణికించింది. ఇంతటి దారుణానికి పాల్పడిన ఈ ఉన్మాదుల ప్లాన్ మరొక లాగా ఉందనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయట. ముఖ్యంగా ఆ ఘటన స్థలంలోని పరిణామాలను చూస్తే చాలా అనుమానాలు కలుగుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా బాంబు పెట్టిన కారులో ప్రయాణికులు ఎందుకు ఉన్నారని ప్రశ్న ఎదురవుతోంది? కారులో బాంబు ఉందని తెలిసే వారు ఎక్కారా లేకపోతే కారులో మరెవరైనా బాంబును అమర్చి ఉంటారా ?అనే విషయం ఇప్పుడు మిస్టరీగానే మారింది.


ఒకవేళ కారులో తీసుకు వెళుతున్న బాంబు అనుకున్న సమయం కంటే ముందుగా పేలిందా? అసలు టార్గెట్ వేరే ఉందా? కారులో ఉన్నవారికి దిగిపోయే అవకాశం కూడా లేదా? అనే విషయం ఇంకా విచారణలో తేలల్సి ఉంది. ముఖ్యంగా ఈ పేలుడు కంటే ముందు ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో ఈ కారును మూడు గంటల పాటు ఆపి ఉంచారు. 3:19 నిమిషాలకు పార్కింగ్ స్థలంలో ఈ కారు ప్రవేశించింది. సాయంత్రం 6:48 నిమిషాలకు పార్కింగ్ స్థలం నుంచి బయటికి వచ్చింది.



ఆ తర్వాత కొద్దిసేపటికి ఈ కారు బ్లాస్ట్ అయింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా 24 మందికి గాయాలయ్యాయి. ఢిల్లీలో ఉండే టూరిస్ట్ స్పాట్ కు మార్కెట్లకు ప్రతి సోమవారం సెలవు ఉంటుంది. సోమవారం రోజు రద్దీ తక్కువగా ఉండడంతో ఈ ప్రమాదం తక్కువగా అయ్యిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ దగ్గర పేలిన ఈ హుందాయి i20 కారు జమ్మూ కాశ్మీర్ లో ఉండే పుల్వామా నివాసి(తారీక్ సల్మాన్) దని అధికారులు గుర్తించారు. చివరిగా ఈ కారు సెప్టెంబర్ 20 ,2025 న రాంగ్ పార్కింగ్ చేసినందుకు ఫరీదాబాద్ లో చలానా విధించినట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఈ వాహనానికి సంబంధించి రిజిస్ట్రేషన్ పత్రాలకు సంబంధించి సల్మాన్ పేరు మీదే ఉన్నాయి. ఈ హుందాయి కారు ఎన్నోసార్లు చేతులు మారిందని అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే ఈ వాహనం కొనుగోలు అమ్మకం పైన చాలా మోసపూరిత పత్రాలు ఉన్నట్లు గుర్తించారు. NSG, NIA, FSL బృందాల సైతం ప్రత్యేకించి మరి పరిశోధనలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: