దేశ రాజధాని ఢిల్లీ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖులెందరో ఉండే హైసెక్యూరిటీ జోన్‌లో జరిగిన ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. చారిత్రక ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం ఓ కారులో జరిగిన భారీ పేలుడుతో 9మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. మరో 24మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా జరిగిన విస్ఫోటంతో జనం ఎగిరిపడ్డారు. దేహాలు ఛిద్రమయ్యాయి. వాహనాలు తునాతునకలయ్యాయి. దుకాణాలు ధ్వంసమయ్యాయి. శకలాలతో క్షణాల్లోనే అది మరుభూమిగా మారింది. క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి. ఉగ్రదాడిగా భావిస్తున్న ఈ పేలుడుతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించారు.

 
దేశవ్యాప్తంగా ప్రజలు సోషల్‌ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. “ఇంత హై సెక్యూరిటీ జోన్‌లో ఇలాంటి బ్లాస్ట్‌ జరిగిందంటే ఇది సాధారణ విషయం కాదు. ఇది ఉగ్రదాడి తప్ప మరేమీ కాదు,” అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. “ఇది దేశాన్ని అణగదీయాలనే శక్తుల దాడి. దీనికి తగిన సమాధానం ఇవ్వాలి,” అంటూ మరో వర్గం స్పష్టంగా చెబుతోంది. చేతులకి గాజులు వేసుకుని కూర్చోలేదు రా..అంతకు అంత రివేంజ్ తీర్చుంటాం అంటూ సోషల్ మీడియాలో ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.



ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే హోం మంత్రిత్వశాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించినట్లు సమాచారం. దాడి వెనుక ఉన్న వారిని ఏదైనా వదిలిపెట్టబోమని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. “దేశ భద్రతతో ఆడుకునే వారిని కనికరం లేకుండా నాశనం చేస్తాం,” అని ఆయన ప్రకటించినట్లు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. సోషల్‌ మీడియాలో కూడా “మోదీ యాక్షన్ తీసుకోవాలి”, “ఆపరేషన్‌ సింధూర్‌ టైప్‌లో మరో కౌంటర్‌ దాడి రావాలి”, “పాకిస్తాన్‌ మద్దతుతో జరిగిన కుట్ర ఇది” అంటూ హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. గతంలో జరిగిన “బాలాకోట్‌ ఎయిర్‌ స్ట్రైక్స్‌” తర్వాత భారత్‌ ఎలా ప్రపంచానికి తన శక్తిని చూపిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా ప్రజలు “దానికి డబుల్‌ రేంజ్‌లో సమాధానం ఇవ్వాలి” అంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదిలా ఉంటే, పేలుడు జరిగిన ప్రదేశాన్ని పూర్తిగా మూసివేసి, అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లు, వాహనాల రికార్డులు, మొబైల్‌ సిగ్నల్‌ ట్రాకింగ్‌ వంటి టెక్నికల్‌ డేటాను విశ్లేషిస్తున్నట్లు సమాచారం. అనుమానాస్పదంగా కనిపించిన కొన్ని వాహనాలను పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు. దేశ ప్రజలు ప్రస్తుతం ఒకే మాట చెబుతున్నారు — “ఇది దేశ గౌరవంపై దాడి. దీనికి తగిన ప్రతీకారం తప్పదు.”

మరింత సమాచారం తెలుసుకోండి: