దేశవ్యాప్తంగా ఉగ్ర దాడులు  పెరిగిపోతున్నాయి. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత కాస్త సైలెంట్ అయిన ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. తాజాగా ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ తో దాదాపుగా 20 మంది వరకు ప్రజలు చనిపోయారు. ఇది ఉగ్రవాదులు చేసిన కుట్రే అని పోలీసులు తెలియజేస్తున్నారు. ఇదంతా ఇలా నడుస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పేలుడు పదార్థాలను పట్టుకున్నారు  ఎన్ఐఏ అధికారులు. ఇదే సమయంలో హైదరాబాదులో కూడా భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు  హైదరాబాదులోని డాక్టర్ సయ్యద్ అహ్మద్ మోహియుద్దీన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.. డాక్టర్ గా చేస్తూ పెద్ద ఎత్తున సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించినట్టు తెలుసుకున్నారు.. 

రాజేంద్రనగర్ సర్కిల్ లో ఉంటున్నటువంటి సయ్యద్ చైనాలో డాక్టర్ కోర్స్ పూర్తి చేశాడు. ఆన్లైన్ కన్సల్టెంట్ డాక్టర్ గా పనిచేస్తూనే ఉగ్రవాదులతో పరిచయం పెంచుకొని, పాకిస్తాన్ నుంచి అందిన హైండర్ ల ఆదేశాలతో  దేశంలో విషం పెట్టి జనాలను చంపేందుకు ప్లాన్ చేశాడు.. ప్రాణాంతకమైనటువంటి రిసీన్ కెమికల్ తో దాడులు చేసేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైనటువంటి జీవ విషాల్లో  రిసీన్ ఒకటి. అయితే ఆముదపు గింజల నుంచి ఈ విషాన్ని తయారుచేస్తారు.  

అయితే దీనికి రుచి, వాసన, రంగు అనేది ఉండవు. ఎందులో కలిపినా కానీ కలిసిపోతుంది. నీటిలో కలిపితే అస్సలు ఏర్పడదు వాసన కూడా రాదు. ఆ నీళ్లు తాగిన వ్యక్తులు చనిపోవడం ఖాయం. ఈ విషాన్ని మంచినీళ్లు, గుడి ప్రసాదాల్లో కలపాలని ఆ డాక్టర్ సయ్యద్ ప్లాన్ చేశారు.దీనివల్ల దేశంలోని వేలాదిమంది మరణించేటట్టు ప్రణాళికలు రూపొందించారని పోలీసులు వెల్లడించారు. వీళ్లే కాకుండా దేశంలో నిషేధించబడ్డ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలతో లింకులున్నటువంటి మరో ఎనిమిది మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు డాక్టర్లు కావడం ఆశ్చర్యపోయే విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: