చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం మంగళంపేటలో పెద్దారెడ్డి, ఆయన కుటుంబం మీద ఉన్న 104 ఎకరాల అటవీ భూమి పైన నిన్నటి రోజున డిప్యూటీ సీఎం అటవీ శాఖ ఉన్నత అధికారులతో టెలికాన్ఫరెన్స్ల మాట్లాడారు. అటవీ చట్టం ప్రకారం POR చార్జిషీట్ దాఖలు చేయాలంటూ అధికారులకు తెలియజేశారు. అక్రమాలను తొలగించి ఆ భూములను స్వాధీనం చేసుకొని కోర్టులో కేసుల వివరాలు దాఖలు చేయాలంటూ విజిలెన్స్ అధికారులతో పాటు POR నివేదికల పైన చర్చించాలని తెలియజేశారు. అలాగే అటవీ భూములను ఆక్రమించిన వారి వివరాలను సైతం వెబ్ సైట్లలో ఉంచాలని తెలిపారు.
ఎవరి అక్రమాలలో ఎంత అటవీ ఆస్తి ఉంది? వారిపైన నమోదైన కేసుల వివరాలను అందుకు సంబంధించి కేసు పరిస్థితి ఏ స్థితిలో ఉంది! వంటి వివరాలను కూడా ప్రజలకు తెలియజేయాలంటూ తెలియజేశారు. అటవీ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలియజేశారు. అటవీ భూముల వ్యవహారంపై కఠినమైన చర్యలు ఉన్నప్పటికీ అవి అమలు లేకపోవడం వల్లే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నట్టు కనిపిస్తుందంటూ పవన్ తన అభిప్రాయంగా తెలిపారు. పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డి 2024 ఎన్నికలలో ఈ అటవీ భూముల గురించి ఆఫిడవిట్లో కొన్ని తప్పుడు సమాచారాలు ఇచ్చారని తన దృష్టికి వచ్చిందని దీనిపైన న్యాయం నిపుణుల సలహాతో ముందుకు వెళ్తామని తెలిపారు. అలాగే రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం 45.8 ఎకరాలు వాళ్ళ ఆధీనంలో ఉన్నదనిలో వెబ్ లాండింగ్లో 77.54 ఎకరాలు చూపించారు. ఒకేసారి ఇంత ఎలా పెరిగిందని విషయంపై పరిశీలించాలంటూ తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి