ఇప్పటివరకు మూడు సార్లు మంత్రివర్గ విస్తరణ చేసిన రేవంత్ రెడ్డి, ఈ సారి మాత్రం “అధిష్టానం మార్క్” షఫ్లింగ్ చేయబోతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సూచనల మేరకు పూర్తిస్థాయి క్యాబినెట్ రీడిజైన్ జరుగుతుందట. 2029 ఎన్నికలే ఫైనల్ టార్గెట్గా పెట్టుకున్న రేవంత్ సర్కార్, ముందుగానే బలమైన టీమ్‌తో ముందుకు సాగాలని చూస్తోంది. ఇటీవల అజారుద్దీన్‌ను మంత్రి వర్గంలోకి తీసుకున్న తర్వాత, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు సివిల్ సప్లై ఛైర్మన్ పదవి ఇచ్చారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ముఖ్య సలహాదారుగా నియమించారు. అయితే ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే రాబోయే క్యాబినెట్ విస్తరణలో ఎవరికీ అవకాశం వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
అదే సమయంలో, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లకు ఈ సారి మంత్రి బెర్త్ ఖాయమని టాక్. కోమటిరెడ్డి కొంతకాలంగా సైలెంట్‌గా ఉండటం కూడా దీని సంకేతంగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మహేష్ గౌడ్ మంత్రిగా వస్తే, అదే సామాజిక వర్గానికి చెందిన మధు యాష్కీ గౌడ్‌కు పీసీసీ చీఫ్ బాధ్యతలు దక్కే అవకాశం ఉందట. ఇదిలా ఉండగా, రాబోయే రోజుల్లో బ్యూరోక్రాట్స్‌లో భారీ మార్పులు జరగబోతున్నాయనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. దీంతో అధికారులు, మంత్రులు రెండింటి వర్గాలూ టెన్షన్‌లోకి వెళ్లారు. ఎవరికి కుర్చీ దక్కుతుంది? ఎవరు ఔట్ అవుతారు? రేవంత్ కొత్త క్యాబినెట్ ఫార్ములాలో ఎవరికి లైన్ క్లియర్ అవుతుందో చూడాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి